Pawan Kalyan- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని రోజుకో రికార్డు ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..మొదటి రోజు లిమిటెడ్ రిలీజ్ వాళ్ళ మెగాస్టార్ రేంజ్ ఓపెనింగ్స్ రాకపోయినప్పటికీ కూడా రెండవ రోజు నుండి మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విలయ తాండవం ఆడిస్తున్నాడు మన మెగాస్టార్..ఎందుకు చిరంజీవి గారిని నెంబర్ 1 హీరో, మెగాస్టార్ అని అందరూ అంటారో ఈ గాడ్ ఫాదర్ వసూళ్లను చూస్తూ అర్థం అవ్వుధి..అరచేతితో సూర్యుడిని ఆపలేము అన్నట్టుగా,ఒక్క డిజాస్టర్ ఫ్లాప్ తో మెగాస్టార్ రేంజ్ పడిపోదు అని నిరూపించిన సినిమా ఇది..కేవలం రెండు రోజుల్లోనే 70 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం..మూడవ రోజు కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది..ఇదే ఊపు ని మరో వారం రోజులు కనుక కొనసాగిస్తే కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటాడని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

ఒక పక్క గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా ఫాన్స్ కి మరోపక్క ఇంకో వార్త వాళ్ళ ఉత్సాహం ని మరింత రెట్టింపు చేస్తుంది..అదేమిటి అంటే ఈ సినిమాని అతి త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేటర్ లో అన్నయ్య చిరంజీవి తో కలిసి కుటుంబ సమేతంగా గాడ్ ఫాదర్ సినిమాని చూడబోతున్నాడట..ఆయన కోసం AMB సినిమాస్ లో ఒక ప్రత్యేకమైన షో ని ఏర్పాటు చేసాడట మెగాస్టార్ చిరంజీవి..ఈ షో కి పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగా ఫామిలీ మొత్తం రాబోతున్నట్టు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ థియేటర్స్ లో సినిమా చూడడం చాలా అరుదు..అలాంటిది గతం లో రామ్ చరణ్ రంగస్థలం సినిమా చూసాడు..ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం కూడా చూడబోతున్నాడు..గాడ్ ఫాదర్ సినిమాకి అద్భుతమైన టాక్ రావడం పవన్ కళ్యాణ్ కి చాలా ఆనందం కలిగించిందట..ఇటీవలే ఆయన చిరంజీవి గారి ఇంటికి వెళ్లి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త.
[…] Also Read: Pawan Kalyan- Chiranjeevi: చిరంజీవి తో కలిసి థియేటర్ ల… […]