
దేశవ్యాప్తంగా నిర్భయను తలపించిన ప్రియాంకరెడ్డి హత్య ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకోవడంతో అడ్వకేట్లు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాయర్లు ఎవరూ కూడా నిందితులకు సహాయం చేయకూడదని, వారి తరఫున వాదించిన కూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదులు సైతం తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంతో ఎవరు వారి తరపున వాదించని పరిస్థితి. అంతేకాదు నిందితులకు కఠినంగా శిక్షపడే విధంగా న్యాయపోరాటం చేస్తామని లాయర్లు చెప్తున్న నేపథ్యంలో, కోర్టులో నిందితులకు ఏ విధమైన శిక్ష పడుతుంది. ఇంత ఘాతుకానికి ఒడిగట్టిన వారికి కోర్టులు ఎప్పటి వరకు శిక్షను విధిస్తాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రియాంకరెడ్డిని హత్యచేసిన నిందితులను ఉరి తీయాలని దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి
ప్రియాంక రెడ్డి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై,హత్య చేసిన సంఘటన యావత్ భారతదేశాన్ని కదిలించి వేస్తోంది. మన చట్టాలను, మన న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితికి ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. నలుగురు మృగాళ్ల చేతిలో దారుణంగా అత్యాచారం గావించ బడి,హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కేసులో నలుగురు నిందితులను పోలీసులు రాత్రి సంఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్ మరియు హత్య కేసులో ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు రాత్రంతా విచారించారు. మరికొద్ది సేపట్లో వారిని బయటకు తీసుకురాబోతున్నారు.