ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం..!

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలు తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. విద్యుత్తు తీగలు కూలీల పాలిట మృత్యు దండాలుగా మారాయి. సంఘటనకు సంబంధించిన వివరాలోకి వెళితే మిరప కాయ కోతకు వెళ్లిన కూలీలు పని ముగించుకుని ట్రాక్టర్ లో ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. మార్గ మద్యంలో ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని డీ కొట్టింది. స్తంభం విరిగి ట్రాక్టర్ ట్రక్కుపై పడింది. ట్రక్కులో కూర్చుని ఉన్న కూలీలు విద్యుత్ […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 8:59 pm
Follow us on

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలు తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. విద్యుత్తు తీగలు కూలీల పాలిట మృత్యు దండాలుగా మారాయి. సంఘటనకు సంబంధించిన వివరాలోకి వెళితే మిరప కాయ కోతకు వెళ్లిన కూలీలు పని ముగించుకుని ట్రాక్టర్ లో ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. మార్గ మద్యంలో ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని డీ కొట్టింది. స్తంభం విరిగి ట్రాక్టర్ ట్రక్కుపై పడింది.

ట్రక్కులో కూర్చుని ఉన్న కూలీలు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు యువకులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో మొత్తం 20 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.