తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న అర్థరాత్రి అస్వస్థకు గురైయ్యారు. ఆమెకు ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
సబితా ఆరోగ్యంపై పలువురు మంత్రులు, నేతలు.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందారు. పెద్ద ఎత్తున అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. సబిత ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సబితా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. “అమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్‌లు నార్మల్ గానే వచ్చాయని వైద్యులు తెలిపారు. మరి కొద్ది సేపట్లో డిశ్చార్జ్ అయ్యి.. ఇంటికి చేరుకోనున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని” విద్యాశాఖ మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.