తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారు. ఎప్పుడు గడపదాటని కేసీఆర్ తన పంథా మార్చుకున్నారు. ఎన్నికల ప్రచారానికి తప్ప బయటకు రాని కేసీఆర్ ఏకంగా పర్యటనలే చేస్తున్నారు. దీంతో అందరి ఆయన చేసే పర్యటనల మీదే పడింది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న సీఎం ఇలా తిరగమేమిటని ఆలోచలో పడ్డారు. కేసీఆర్ వ్యూహమేమిటని ఆరా తీస్తున్నారు. మొన్న గాంధీ, నిన్నవరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రులను తిరిగారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈటల రాజేందర్ ను తప్పించాక బాధ్యతలను కేటీఆర్, హరీశ్ రావు కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ శాఖపై తన ముద్ర వేయాలనుకుని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు.
కరోనా పాజిటివ్ రేటు తగ్గడంతో బ్లాక్ ఫంగస్ ను ఎదుర్కొనేలా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని తీర్చిదిద్దాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆస్పత్రుల్లో మార్పులు ఎలా చేయాలో పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వసతులు ఏర్పాటు చేసేలా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా చూడాలని భావిస్తున్నారు. ప్రజలకు వైద్యం అందించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పడానికి సీఎం ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వం వైద్యం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వైద్య ఆరోగ్య శాఖ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సీఎం ముందుకు వెళ్తున్నారు. జిల్లాలోని ఆస్పత్రులను చూసిన తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. అప్పుడే ఆస్పత్రుల తీరుపై నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను గమనించిన సీఎం వాటిని నిర్మూలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ రోగులను దగ్గర నుంచి పరిశీలించిన సీఎం రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.
పలు జిల్లాల్లో రోగుల పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెప్పిస్తున్నారు. వారు పడే బాధల గురించి ఆరా తీస్తున్నారు. త్వరలోనే వాటికి ముగింపు పలకాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆస్పత్రులను చూసి అక్కడ పరిస్థితులను అవలోకనం చేసుకుని సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతుకున్నారని పలువురు చెబుతున్నారు.