
భారత్ లో స్పిన్ పిచ్ లపై ఇంగ్లండ్ ను చావుదెబ్బతీసిన ఇండియాకు అక్కడ సీమ్ పిచ్ లతో బెంబేలెత్తించి ఓడించాలని ఇంగ్లండ్ టీం ప్లాన్ చేస్తోంది. ఇటీవల ఇండియాలో జరిగిన ఇంగ్లండ్ టూర్ లో మొదటి టెస్టులో మొదటి పిచ్ ను సీమ్ కు అనుకూలించేలా తయారు చేసి టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లండ్ సునాయాసంగా గెలిచింది. ఆ తర్వాత స్పిన్ పిచ్ లతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. ఈ క్రమంలోనే ఆ ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ కాచుకు కూర్చుంది.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్ గడ్డపై టీం ఇండియా అదరగొట్టేలా కోచ్ రవిశాస్త్రి కొత్త ప్లాన్లు సిద్ధం చేస్తున్నాడు. భారత ఆటగాళ్లు భారీ శతకాలు చేసేలా శిక్షణ పద్ధతుల్లో మూడు కొత్త మార్పులు చేస్తున్నారని తెలిసింది. బ్యాట్స్ మెన్ పెద్ద స్కోర్లు చేస్తేనే బౌలర్లు ఒత్తిడి లేకుండా 20 వికెట్లు తీయగలరని రవిశాస్త్రి ప్లాన్లు రచిస్తున్నాడు.
ఇంగ్లండ్ పిచ్ లు స్వింగ్, బౌన్స్ ఉంటాయి. చక్కని పచ్చికతో బంతులు వేగంగా దూసుకొస్తాయి.అక్కడి వాతావరణం, పరిస్థితులకు అనుగుణంగా అలవాటు పడాలి. ఇంగ్లండ్ పేసర్లు సొంత గడ్డపై చెలరేగుతారు. ఆసియా దేశాలు ఇక్కడి బౌన్సీ పిచ్ లపై ఇబ్బంది పడుతాయి. చివరి పర్యటనలోనూ ఇండియా ఓడిపోయింది.ఈ క్రమంలోనే కోచ్ రవిశాస్త్రి ప్రతీ ఆటగాడు సెంచరీలు చేసేలా కనీసం ఇద్దరు రాణించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాడు.ఇందుకోసం మూడు ప్రణాళికలు రచిస్తున్నాడు.
ఈ క్రమంలోనే పిచ్ పొడవును 16 గజాలకు తగ్గించడం.. నునుపు బంతులతో సాధన చేయించడం.. కఠిన బంతులను వదిలేసేలా ముందే సిద్ధం చేస్తున్నాడు రవిశాస్త్రి. వేగంగా వచ్చే బంతులను ముందుగా ఆడేలా తీర్చిదిద్దుతున్నాడు. స్వింగ్ బౌలింగ్ ను ఆడేలా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇలా మూడు ప్లాన్లతో రవిశాస్త్రి టీమిండియాను రాటుదేలాలే ఇంగ్లండ్ లో రాణించేలా పకడ్బందీగా ముందుకెళుతున్నాడు.