కరోనాతో 154 కోట్ల మంది విద్యార్థులకు నష్టం

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 154 కోట్లకు పైగా విద్యార్థులు నష్ట పోయే అవకాశం ఉన్నట్లు యునెస్కో అంచనా వేసింది. కరోనా నిర్మూలనకు దేశాలన్నింటిలో లాక్ డౌన్ ప్రకటించడంతో విద్యాసంస్థలు మూతపడి, విద్యార్థుల చదువుకుఆటంకం ఏర్పడింది. దానితో చాలామంది విద్యార్థలు తమ విద్యా సంవత్సరాన్ని కొల్పోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా బాలికలు ఎక్కువగా నష్టపోయే అవకాశముంది. లాక్ డౌన్ కారణంగా బాలికల డ్రాప్-అవుట్ రేట్లు పెరగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. పైగా ఇది విద్యారంగంలో కూడా లింగ […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 4:41 pm
Follow us on


కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 154 కోట్లకు పైగా విద్యార్థులు నష్ట పోయే అవకాశం ఉన్నట్లు యునెస్కో అంచనా వేసింది. కరోనా నిర్మూలనకు దేశాలన్నింటిలో లాక్ డౌన్ ప్రకటించడంతో విద్యాసంస్థలు మూతపడి, విద్యార్థుల చదువుకుఆటంకం ఏర్పడింది. దానితో చాలామంది విద్యార్థలు తమ విద్యా సంవత్సరాన్ని కొల్పోయే ప్రమాదం ఏర్పడింది.

ముఖ్యంగా బాలికలు ఎక్కువగా నష్టపోయే అవకాశముంది. లాక్ డౌన్ కారణంగా బాలికల డ్రాప్-అవుట్ రేట్లు పెరగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. పైగా ఇది విద్యారంగంలో కూడా లింగ అంతరాలను మరింత పెరుగుతాయని యునెస్కో భావిస్తున్నది.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పాఠశాలలను మూసివేయడం వల్ల కౌమారదశలో ఉన్న బాలికల డ్రాప్-అవుట్లు పెరిగే అవకాశం ఉందని యునెస్కో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియానిని హెచ్చరించారు. ఈ కరోనా ప్రభావం విద్యరంగంలో లింగ అంతరాలను పెంచడంతో పాటు.. మైనర్ వివాహాలు పెరగడానికి కారణమవుతందని ఆమె అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ప్రస్తుతం 89 శాతం మంది చదువుకు దూరమయ్యారని యునెస్కో అంచనా వేస్తున్నది. అది పాఠశాల లేదా విశ్వవిద్యాలయంలో చదువుతున్న 154 కోట్ల మంది విద్యార్థులకు సమానం. ఇందులో దాదాపు 74 కోట్ల మంది బాలికలు ఉన్నారు.

దాదాపు 11 కోట్ల మంది బాలికలు ప్రపంచంలోనే తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో నివసిస్తున్నారు. అక్కడ విద్యను పొందడం ఇప్పటికే కష్టంగా ఉంది. ఇప్పడు కరోనా వల్ల మరింత క్లిష్టం కానుంది. చాలా దేశాలలో ప్రభుత్వాలు పాఠశాలలను నిరవధికంగా కొంతకాలం పాటు మూసివేయాలని భావిస్తుండడం ఈ సందర్భంగా ఆందోళన కలిగిస్తున్నది.

పాఠశాలలను మూసివేస్తే శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్న విద్యార్థులు, అనాథ బాలికలకు చాలా పెద్ద సమస్య అవుతుందని యునెస్కో హెచ్చరించింది. అంతేకాకుండా పేద విద్యార్థలు మళ్లీ పాఠశాలలు తెరచిన తర్వాత రావడానికి ఇష్టపడరని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఆన్ లైన్ విద్యను ప్రోత్సహించాలని పలు ప్రభుత్వాలు భావిస్తున్నా సగం మందికి పైగా విద్యార్థులకు ఇంటర్ నెట్ అందుబాటులో లేన్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అటువంటి విద్యార్థుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.