Rajinikanth Income Tax Award: సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడులోనే అత్యధిక పన్నును చెల్లిస్తున్నాడు. దాంతో ఆదాయపు పన్ను శాఖ ప్రతిష్ఠాత్మక అవార్డును రజనీకి ప్రదానం చేసి, సత్కరించింది. చెన్నైలో నేడు ఆదాయపు పన్ను దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ అవార్డును బహుకరించారు. రజినీకాంత్ స్థానంలో ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య ఈ అవార్డును అందుకున్నారు. అలాగే బాలీవుడ్ విషయానికి వస్తే.. అక్కడ స్టార్స్ లో అత్యధిక పన్నును చెల్లించాడు అక్షయ్ కుమార్. దాంతో అక్షయ్ కుమార్ కి కూడా ఆదాయపు పన్ను శాఖ తమ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించింది. మరి టాలీవుడ్ పరిస్థితి ఏమిటి ?,
కోలీవుడ్ లో రజని, బాలీవుడ్ లో అక్షయ్.. మరి టాలీవుడ్ లో ఎవరు ?, ఏ.. మన హీరోలు పన్ను సక్రమంగా చెల్లించడం లేదా ?, అందుకే ఏ అవార్డు మన హీరోలకు దక్కలేదా ?. నిజానికి రజనీకాంత్ కంటే.. మహేష్ బాబు సంపాదన ఎక్కువ. అలాగే, అక్షయ్ కుమార్ సంపాదన కంటే మన ప్రభాస్ సంపాదనే ఎక్కువ. అయినా ఇటు మహేష్ కి గానీ, అటు ప్రభాస్ కి గానీ ఆదాయపు పన్ను శాఖ తమ ప్రతిష్ఠాత్మక అవార్డును ఎందుకు ఇవ్వలేదు.
Also Read: Thank You Movie Collections: ‘థాంక్యూ’ 4 డేస్ కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
మిగిలిన స్టార్ హీరోల సంపాదన కూడా తక్కువేం కాదు. ఎన్టీఆర్, చరణ్, బన్నీ.. వీరంతా వందల కోట్ల సినిమాలకు హీరోలే కదా. పోస్టర్ల మీద మొదటి రోజే 70 కోట్లు కలెక్ట్ చేసింది మా సినిమా అని గొప్పలు పోతారు. కానీ..పన్ను చెల్లించడంలో మాత్రం తిప్పలు పడుతున్నారా..! తెలుగు స్టార్ హీరోలు కలెక్షన్స్ విషయంలోనే కాదు, పన్ను ఎగొట్టడంలో కూడా పోటీ పడుతున్నట్లు ఉన్నారు.
అదేమిటి ?, మన హీరోలు కూడా ప్రభుత్వాలకు టాక్స్ కడుతున్నారు కదా, అవును. కానీ ఎంత అంటే.. ఏదో ఉడతా భక్తి లాగా.. అంతే.
సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు మాది 400 కోట్లు బడ్జెట్, 500 కోట్లు బడ్జెట్ అని అదేదో ఘనకార్యం అన్నట్టు దంఖా బజాయించి పబ్లిసిటీ చేసుకుంటారు సదరు హీరోలు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. చెప్పే ఫిగర్ కి బోర్డర్స్ కూడా ఉండవు. మరి అన్ని వందల కోట్లకి పన్ను అంటే భారీగా ఉంటుందిగా. మరి అంత పన్ను కడుతున్నప్పుడు.. మన వాళ్లకు ఎందుకు అవార్డు ఇవ్వలేదు.
రెండేళ్లకు సినిమా చేసే రజనీకాంత్ కే అవార్డు ఇచ్చినప్పుడు.. రజనీకాంత్ కంటే, అక్షయ్ కుమార్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న మహేష్ – ప్రభాస్ లకు అవార్డు ఎందుకు ఇవ్వలేదు ?, ఆస్కార్ అవార్డ్స్ లో ఇండియన్ సినిమాకి అన్యాయం జరిగినట్టు.. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన ప్రతిష్ఠాత్మక అవార్డ్స్ విషయంలో కూడా మన తెలుగు హీరోలకు అన్యాయం జరిగిందని మనం అన్వయించుకోవాలి. అంతే గానీ, ట్యాక్స్ విషయంలో మన హీరోలు కక్కుర్తి పడుతున్నారని మాత్రం ఫ్యాన్స్ గా మనం ఒప్పుకోలేం.
మన ఒక్కో స్టార్ హీరో ఒక్కో సినిమాకు దాదాపు 50 కోట్లు వరకు పుచ్చుకుంటున్నాడు. పైగా థియేటర్ రైట్స్ లో వాటా కూడా ఉంటుంది. ఇది సినిమా హిట్ ను బట్టి.. 10 కోట్ల నుంచి 30 కోట్ల విలువ చేస్తోంది. మరి సంవత్సరంలో రెండు సినిమాలు వేసుకొన్నా.. మన ఒక్కో స్టార్ హీరో సంవత్సర ఆదాయం దాదాపు 105 కోట్ల నుంచి 150 కోట్లు వరకు ఉంటుంది. ఈ కోట్లు అన్నిటికీ సదరు హీరోలు నిజంగానే పన్నులు కడుతున్నారా ?, కడితే.. అవార్డులు వచ్చి ఉండేవి కదా. అసలు స్టార్ హీరోలంతా ఎంత పన్ను కడుతున్నారు అనేది ప్రశ్నార్ధకమే.
Also Read:Nidhi Agarwal: అరెరే.. నిధి.., విధి నిన్ను ఇలా చేసిందేమిటి ?
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Income tax department special award to superstar rajinikanth mahesh prabhas earned more than rajinikanth akshay why was the award not given
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com