Sambhal : భారత దేశం ప్రాచీన సంస్కృతికి పుట్టినిల్లు. మన దేశంల అనేక పురాతన కట్టడాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని కట్టాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇటీవల సంభల్‌లో మసీదు వివాదంలో చెలరేగిన అల్లర్ల తర్వాత సంభల్ చర్చనీయాంశమైంది. తర్వాత జరిగిన పరిణామాలతో సంభల్ సంచలనాలకు వేదిక అయింది. నగరంలో జరుగుతున్న తవ్వకాల్లో పాతకాలం నాటి విశేషాలు బయటపడుతున్నాయి. మొన్న శివాలయం బయట పడింది. తాజాగా 1857 లో సిపాయిల తిరుగుబాటలో వాడుకున్న సొరంగం బావి బయట పడింది. ఇంక ఎన్ని రహస్యాలు ఉన్నాయి అన్నది ఆసక్తిగా మారింది.
విగ్రహాలు, శివ లింగాలు, బావులు..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ సంచలనాలకు వేదికైంది. ఇటీవల మసీదు వివాదంతో మొదలైన అలజడి, తాజాగా బయటపడుతున్న పురాత కట్టాడల వ్యవహారం ఆసక్తి పెంచుతోంది. పాత ఆలయాలు, విగ్రహాలు, శివలింగాలు, బావులు సొరంగాలు వెలుగు చూస్తున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారితీస్తున్నాయి. బయటపడిన ఆలయంలో పురాతన హనుమాన్ విగ్రహం ఉంది. దాని కిందనే శివలింగం బయటపడింది. నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. పురాతన ఆలయాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. మరో చోట 60 ఏళ్ల క్రితం నాటి సొరంగ మార్గం, మెట్లబావి కనిపించాయి. ఈ పరిణామాలు సాంస్కృతిక ఆనవాళ్లపై చర్చకు దారితీశాయి.
1857 తిరుగుబాటు సమయంలో..
తాజాగా బయటపడిన సొరంగం, మెట్ట బావి బ్రిటిష్ పాలనలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1857లో తిరుగుబాటుదారులు తప్పించుకోవడానికి ఈ సొరంగం ఉపయోగించినట్లు తెలుస్తోంది. 150 ఏళ్ల క్రితం నాటి మెట్ల బావి కూడా ఉన్నట్లు గుర్తించారు. మెట్ల బావిపేరు రాణీకి బావ్డీ చెబుతున్నారు.
బిలారి రాజు తాతయ్య హయాంలో..
ఇక మెట్ల బావి బిలారి రాజు తాతయ్య హయంలో కట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నిర్మాణంలో మొత్తం మూడు స్థాయిలు ఉన్నాయి. వీటిలో రెండు పాలరాయితో తయారు చేసిన కొన్ని అంతస్తులు. ఇక రూఫ్ భాగం, బావి, నాలుగు గదులను ఇటుకలతో నిర్మించారు. మెట్లబావికి సమీపంలో ఉన్న బిహారీ దేవాలయానికి చుట్టూ కూడా పురావస్తు శాఖ అధికారులు దృష్టిపెట్టారు.
రికార్డుల్లో చెరువుగా..
ఇక 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెట్ల బావిని రెవెన్యూ రికార్డులో చెరువుగా నమోదు చేశారు. ప్రస్తుతం దానికి నష్టం జరుగకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ స్థలం చుట్టూ అక్రమ కట్టడాలు తొలగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంతోపాటు మరో ఐదు ప్రాంతాల్లో ఐదు పుణ్యక్షేత్రాలు, 19 బావులు ఉన్నట్లు సర్వే చేసింది.
201 చ. మీట్ల స్థలం..
ఇదిలా ఉంటే చందౌసీ నగర్ పాలికా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేతృత్వంలో జరిపిన తవ్వకాల్లో 210 చదరపు మీటర్ల స్థలం బయటపడింది. మిగిలిన ప్రాంతాలను వెలికి తీయడానికి ఇప్పటికే కనిపించిన పురాత నిర్మాణాలను పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు, తవ్వకాలు స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలతో జరుగుతున్నాయి. లక్ష్మణ్‌గంజ్‌లో సహాస్‌పూర్ రాజ కుటుంబం ఉండేదని, అక్కడ మెట్టబావి కూడా ఉందని సనాతన్ సేవక్ సంఘ్ సభ్యులు పేర్కొంటున్నారు.
కార్తికేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కార్బన్ డేటింగ్
దీనికి ముందు పురావస్తు శాఖ సంభాల్‌లోని కార్తికేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కార్బన్ డేటింగ్ చేపట్టింది. 46 ఏళ్లు మూసి వేసిన తర్వాత డిసెంబర్ 13న తిరిగి తెరిచారు. ఇక్కడి నుంచి హిందువులు వెళ్లిపోయిన తర్వాత ముస్లిం నివాసాలు వెలిశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 1978 నుంచి ఆలయం మూసి వుంది. అధికారులు కార్బన్ డేటింగ్ నిర్వహించిన తర్వాత అనుకోని విధంగా బయటపడింది.
– ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఒక చినన పట్టణం. ఈ ప్రాంతం చారిత్రకంగా ఖ్యాతి చెందింది. నారాయణుడు 24వ అవతారమైన కల్కి సంభాల్‌లో అవతరిస్తాడని శ్రీమద్ భాగవతంలో ఉంది. 12వ ఖండంలోని రెండో అధ్యాయంలో పేర్కొన్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Centuries old stepwell discovered during survey in ups sambhal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com