Oscars 100th Anniversary: ఆస్కార్ అవార్డు ప్రారంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది వేడుకలు నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈమేరకు సన్నాహాలు కూడా ప్రారంభించామని తెలిపారు. ఇందుకు భారీగా నిధులు కూడా కేటాయించారు.
ఎప్పుడంటే..
ఆస్కార్ శతాబ్ది వేడుకలు 2028లో నిర్వహించనున్నారు. ఆస్కార్ 100 పేరిట నిర్వహించనున్నట్లు రోమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్కార్ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకల నిర్వహణ ఇప్పుడు హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
500 మిలియన్ డాలర్లతో క్యాంపెయిన్..
ఆస్కార్ 100 వేడుకల పై 500 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4 వేల కోట్లు)తో క్యాంపెయిన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదిన్నరలో ఇప్పటి వరకు ఆస్కార్ 100 కోసం వంద మిలియన్ డాలర్లు సేకరించారు. వినూత్నంగా ప్లాన్ చేస్తున్న ఈ వేడులకు ఎలా నిర్వహించాలనే అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. అనేక చర్చల అనంతరం నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.
వచ్చే ఏడాది 97 వేడుక..
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మార్చి 2న ఆస్కార్ 97 వేడుక నిర్వహించనున్నట్లు ఆస్కార్ కమిటీ ప్రస్తుత సీఈవో బిల్ క్రామోర్ తెలిపారు. ఈ వేడుకలు నిర్వహిస్తూనే ఆస్కార్ 100 క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నాలుగు వేల కోట్ల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మరో మూడేళ్లలో లక్ష్యాన్ని చేరుకుంటామని వెల్లడించారు.