Sudarshan leaf juice : చాలామందికి కొన్ని మొక్కల ఆకు గురించి పెద్దగా తెలియదు. కొన్ని మొక్కల ఆకులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాన్ని చేకూరస్తుంటాయి. మనకి తెలియకుండా చాలా మొక్కల ఆకులు ఔషధంలా పనిచేస్తాయి. వీటిని మందులు తయారీకి ఎక్కువగా వాడుతుంటారు. ఇలా సహజంగా ఆకులతో తయారు చేసిన మందులను తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే చాలామంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా ఉండే మందులను వాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే మనకి తెలియకుండా చాలా ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో ఒకటి సుదర్శన్ మొక్క ఆకు. దీని గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు బోలెడన్నీ ఉన్నాయి. సుదర్శన్ ఆకులలో సహజ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు శరీరంలోని ఎలాంటి సమస్యల నుంచి అయిన కూడా విముక్తి పొందవచ్చు. మరి ఈ ఆకు ఏ సమస్యలకు ఔషధ గుణంగా పని చేస్తుంది? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
పోషక విలువలు ఎక్కువగా ఉండే సుదర్శన ఆకుని రసం చేసుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకు రసం తాగితే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. చెవి నొప్పితో బాధపడుతున్న వాళ్లకి ఈ సుదర్శన్ ఆకు రసం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఔషధ గుణాలు చెవి వాపు, నొప్పి నుంచి ఉపశమనాన్ని కల్పిస్తాయి. ఈ సుదర్శన్ ఆకుకి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకు జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఈ ఆకు రసాన్ని చెవిలో కొన్ని చుక్కలు వేసిన చెవి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ పద్ధతిని పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారని.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ ఆకు వల్ల జ్వరం, కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. విరుగుడుగా పిలిచే ఈ సుదర్శన్ ఆకుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఆకు లభించకపోతే దీనికి సంబంధించిన ట్యాబ్లెట్లు కూడా మార్కెట్లో దొరుకుతాయి.
తీవ్ర జర్వంతో బాధపడేవాళ్లు ఈ సుదర్శన మొక్క కాండం పొడిని తేనె, వేడి నీటిలో కలిపి తాగితే వెంటనే ఉపశమనం పొందుతారు. అయతే దీనిని కేవలం 2 నుంచి 3 గ్రాముల పొడిని మాత్రమే ఉపయోగించాలి. ఎవరికైనా కీళ్లు నొప్పులు అధికంగా ఉండి, వాపు ఉంటే దాని చుట్టూ అప్లై చేస్తే తగ్గుతుంది. ఈ ఆకులను పేస్ట్‌లా తయారు చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ మీద అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడుతున్నవారు ఈ ఆకు రసాన్ని తాగడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఈరోజుల్లో చాలామంది గంటలు తరబడి కూర్చుని వర్క్ చేయడం వల్ల ఫైల్స్ సమస్య వస్తోంది. అలాంటి వాళ్లకి సుదర్శన్ మొక్క బాగా పనిచేస్తుంది. దీని కాండం చూర్ణంతో ఫైల్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మరి మీరు ఎప్పుడైనా ఈ సుదర్శన్ మొక్క ఆకులను చూశారా? తాగారా? లేదో కామెంట్ చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.