https://oktelugu.com/

Brain fog  : బ్రెయిన్ ఫాగ్ ప్రమాదమేనా? దీనిని నివారించడం ఎలా?

ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గపోవడం వంటి సమస్యల వల్ల బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. ఎంత పనిచేసిన శరీరానికి తప్పకుండా విశ్రాంతి ఉండాలి. లేకపోతే ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకి తప్పకుండా 8 గంటలు నిద్రపోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 24, 2024 11:53 am
    Brain fog 

    Brain fog 

    Follow us on

    Brain fog  :  కొందరు ఏ పని మీద అయిన దృష్టి పెట్టలేకపోతుంటారు. ఏదో ఆ సమయానికి ఏదైనా సమస్య ఉండటం వల్ల దృష్టి పెట్టలేకపోతే పర్లేదు. కానీ ఎక్కువ సార్లు ఏ విషయంపైన అయిన దృష్టి పెట్టలేకపోవడం, గందరగోళంగా ఉండటం, బుర్ర కాస్త మబ్బుగా ఉండటాన్ని బ్రెయిన్ ఫాగ్ అంటారు. ఈ సమస్య ఉన్నవారు దేని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేరు. ప్రతి విషయానికి ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు. ఈ బ్రెయిన్ ఫాగ్ వల్ల తొందరగా డిప్రెషన్‌లోకి వెళ్తారు. మీలో ఆత్మ విశ్వాసం కూడా తగ్గిపోతుంది. కొందరు విశ్రాంతి లేకుండా ఎక్కువగా వర్క్ చేస్తారు. దీనివల్ల వాళ్లకు అలసట, ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గపోవడం వంటి సమస్యల వల్ల బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. ఎంత పనిచేసిన శరీరానికి తప్పకుండా విశ్రాంతి ఉండాలి. లేకపోతే ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకి తప్పకుండా 8 గంటలు నిద్రపోవాలి.

    ఎక్కువగా వర్క్ చేయడం వల్ల కొందరు ఒత్తిడికి గురవుతారు. ఇది క్రమంగా బ్రెయిన్ ఫాగ్‌కు కారణం అవుతుంది. దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురవుతుంటే.. రక్తపోటు పెరుగుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అలాగే మానసిక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువగా ఒత్తిడికి గురికావద్దు. క్యాన్సర్ చికిత్స తీసుకున్నవాళ్లలో కూడా ఈ బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. దీనినే కీమో బ్రెయిన్ అంటారు. అయితే ఆరోగ్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, అనారోగ్యమైన కొవ్వులు తీసుకోవడం, విటమిన్ల లోపం వల్ల ఈ సమస్య పెరుగుతుంది. మహిళల్లో అయితే ముఖ్యంగా పీరియడ్స్, గర్భధారణ, థైరాయిడ్ వంటి సమస్యల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. చాలా మంది మహిళలకు పీరియడ్స్ సమయంలో కాస్త మతిమరుపుగా, ఏకాగ్రతతో ఇబ్బంది పడుతుంటారు.

    బెయిన్ ఫాగ్‌ను నివారించాలంటే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. తగినంత నిద్ర, మెదడుకి విశ్రాంతి ఉండటం వల్ల తగ్గుతుంది. ఎలాంటి ఒత్తిడికి లోనవుకుండా మానసికంగా ఫ్రీగా ఉండాలి. దేని మీద ఏకాగత పెట్టలేకపోతే.. ఫజిల్ గేమ్స్ ఆడాలి. రోజూ వ్యాయామం, మెడిటేషన్, యోగా వంటివి చేయాలి. రక్త హీనతతో బాధపడుతున్న దానికి చికిత్స తీసుకోవాలి. మద్యం, ధూమపానం, కెఫిన్ వంటి పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా కూడా విశ్రాంతికి కొంత సమయం ఇవ్వాలి. రోజూ తాజా పండ్లు, గుడ్లు, పాలు వంటివి తీసుకోవాలి. వీటివల్ల బ్రెయిన్ ఫాగ్ తగ్గుతుంది. కొందరు అయితే చిన్న విషయానికి ఆందోళన చెందకుండా.. కూల్‌గా ప్రతి విషయాన్ని ఆలోచించాలి. మరీ పూర్తిగా ఏకాగ్రత పెట్టలేకపోతుంటే.. వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. దీనికి తగ్గించాలంటే మెదడు పనితీరును మెరుగుపర్చుకోవాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.