ప్రపంచ దేశాలు ప్రస్తుతం కరోనా మహమ్మారి పేరు వింటే భయాందోళనకు గురవుతున్నాయి. పలు దేశాలు మొదట్లో కరోనాను కట్టడి చేసినా ఆయా దేశాల్లో మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానం ద్వారా మాత్రమే కరోనా వైరస్ ను కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కరోనా పరీక్ష చేయించుకోవాలంటే అంత సులభం కాదనే సంగతి తెలిసిందే.
Also Read..కరోనా విషయంలో మరో గుడ్ న్యూస్.. 30 సెకన్లలో వైరస్ ఖతం..?
ప్రస్తుతం సమీపంలోని ఆస్పత్రిని సందర్శించి కరోనా పరీక్ష చేయించుకునే అవకాశం ఉంది. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల ద్వారా కరోనా వైరస్ సోకిందో ప్రస్తుతం నిర్ధారిస్తున్నారు. అయితే ఇకపై సులభంగా ఇంట్లోనుంచే కరోనా పరీక్ష చేయించుకోవచ్చు. సెనెగల్ లోని బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ పాశ్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరోనా పరీక్షలు సులభంగా ఇంట్లో నుంచే చేసుకునే విధంగా కరోనా టెస్ట్ కిట్ ను రూపొందించింది.
ఈ కరోనా టెస్ట్ కిట్ ధర ఒక డాలర్ కంటే తక్కువగా ఉండనుందని సమాచారం. ప్రస్తుతం ఈ టెస్ట్ కిట్స్ గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నాటికి ఈ టెస్ట్ కిట్స్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కోటి నుంచి కోటిన్నర టెస్ట్ కిట్లను తయారు చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఇంటి నుంచి కరోనా పరీక్ష చేయించుకునే ఛాన్స్ ఉండటంతో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవచ్చు.
Also Read..చెవుల్లో ఆ శబ్దం వినిపిస్తోందా.. ఖచ్చితంగా కరోనానే..?
మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. ఫైజర్, మోడెర్నా సంస్థల వ్యాక్సిన్లు మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే వేగంగా క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని వ్యాక్సిన్లను అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.