
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు నిట్ వరంగల్ శుభవార్త చెప్పింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్ తాత్కాలిక ప్రాతిపదికన 18 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ 18 ఉద్యోగాలలో సీనియర్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, సూపరిండెంట్ ఇంజనీర్, స్టూడెంట్స్ యాక్టివిటీ & స్పోర్ట్స్ ఆఫీసర్, డిప్యూటీ లైబ్రేరియన్ ఉద్యోగాలు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఉద్యోగాల భర్తీ జరగనుంది.
నిరుద్యోగ అభ్యర్థులు https://www.nitw.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 10వ తేదీ 2020 సంవత్సరం చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లో ఇతర వివరాల గురించి తెలుసుకోవచ్చు. అర్హతకు తగిన స్థాయిలో వేతనాల చెల్లింపులు ఉంటాయి.
కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు అర్హతకు తగిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిట్ వరంగల్ ఈ ఉద్యోగాల కోసం కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచనలు చేస్తోంది. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైనా కొన్ని నెలలు మాత్రమే ఈ ఉద్యోగాలలో కొనసాగుతారు. నిట్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ పద్దతిలో ఈ 18 ఉద్యోగాలకు ఉద్యోగులను ఎంపిక చేసుకోనుంది.
మరోవైపు కేంద్రప్రభుత్వం, ఐబీపీఎస్ నుంచి వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. చాలా నెలల క్రితమే జరగాల్సిన పోటీ పరీక్షలు కరోనా, లాక్ డౌన్ వల్ల వాయిదా ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
Comments are closed.