ఆధునిక కాలంలో చాలామంది సమయపాలనను పాటించకుండా ఇష్టానుసారం నచ్చిన ఆహారాన్ని తింటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. సరైన అహారపు అలవాట్లు లేకపోవడం వల్ల బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బరువు పెరిగిన తరువాత బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేసి చాలామంది ఫెయిల్ అవుతున్నారు.
అయితే కీరదోసతో సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కీరదోస తినడం వల్ల సులభంగా ఏడు రోజుల్లో ఏడు కిలోల బరువు తగ్గవచ్చు. కీరదోస సహాయంతో సహజసిద్ధంగా బరువు తగ్గవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కీరదోస సహాయంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలోనే కీర దోసకాయలు అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తాయి. కీరదోసలో తక్కువ కేలరీలు, తక్కువ ప్రోటీన్లు ఉంటాయి.
ఎవరైతే కీరదోస డైట్ ను ఫాలో కావాలని అనుకుంటారో వారు రోజూ తినే ఆహారాన్ని తగ్గించి కీరదోస ముక్కలను ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. రోజులో ఆకలి అనిపించిన ప్రతిసారి కీరదోస ముక్కలను తీసుకుంటే మంచిది. అదే సమయంలో కోడిగుడ్లు, చికెన్, చేపలు, తృణధాన్యాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ప్రోటోన్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
కీరదోస ముక్కలను తినడం ద్వారా తక్కువ సమయంలోనే ఏడు కిలోల వరకు బరువు తగ్గవచ్చు. అయితే ఈ డైట్ ఫాలో అవ్వాలని భావించే వాళ్లు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని బరువు తగ్గితే మంచిది.