https://oktelugu.com/

షర్మిలమ్మ పోరాటం షూరు చేసింది!

ఏడేండ్ల తెలంగాణలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఇంకా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ప్రకటనల కోసం ఎదురుచూడలేక ఇప్పటికే నిరుద్యోగుల ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కేయూ స్టూడెంట్‌ ఆత్మహత్య రాష్ట్రమంతా కలకలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ అటు విపక్షాలు, ఇటు స్టూడెంట్‌ యూనియన్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ చావులను నిరసిస్తూ వైఎస్‌ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను చూసి తట్టుకోలేక తెలంగాణ ఆడబిడ్డగా పోరాటం షురూ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 15, 2021 1:39 pm
    Follow us on

    Sharmila Unemployment
    ఏడేండ్ల తెలంగాణలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఇంకా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ప్రకటనల కోసం ఎదురుచూడలేక ఇప్పటికే నిరుద్యోగుల ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కేయూ స్టూడెంట్‌ ఆత్మహత్య రాష్ట్రమంతా కలకలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ అటు విపక్షాలు, ఇటు స్టూడెంట్‌ యూనియన్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

    ఈ చావులను నిరసిస్తూ వైఎస్‌ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను చూసి తట్టుకోలేక తెలంగాణ ఆడబిడ్డగా పోరాటం షురూ చేసింది. ఇప్పటికే ఏప్రిల్‌ 9న బహిరంగ సభ నిర్వహించిన ఆమె.. తెలంగాణ ప్రభుత్వంపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇప్పుడు మరోమారు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు.

    ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష ఇందిరా పార్కు వేదికగా ప్రారంభమైంది. దీక్షా శిబిరానికి షర్మిల ముందుగా వైఎస్సార్‌‌ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. శ్రద్ధాంజలి ఘటించారు.

    తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆమె ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. షర్మిల 72 గంటల పాటు దీక్ష చేయాలని సంకల్పించినా.. పోలీసులు ఒక్కరోజుకే పర్మిషన్‌ ఇచ్చారు. ఈ సాయంత్రం 5 గంటల వరకే అనుమతిచ్చారు. దీంతో ఇప్పుడు షర్మిల దీక్షపై సందిగ్ధం నెలకొంది. ఈ సాయంత్రంతో దీక్షను ముగిస్తారా.. లేక బలవంతంగా అయినా కొనసాగిస్తారా తెలియకుండా ఉంది. ఇప్పటికే ఖమ్మం సభ వేదికగా షర్మిల సర్కార్‌‌ అల్టీమేటం జారీ చేశారు. ఈనెల 15లోపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రాకుంటే దీక్ష తప్పదని హెచ్చరించారు. చెప్పినట్లుగానే ఆమె దీక్షకు పూనుకున్నారు.