https://oktelugu.com/

బిర్యానీ తినడం వల్ల కలిగే ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

మన దేశంలో బిర్యానీ ప్రియులు కోట్ల సంఖ్యలో ఉంటారనే సంగతి తెలిసిందే. మాంసం ప్రియులు బిర్యానీని ఎంతగానో ఇష్టపడతారు. పెర్షియన్ పదం అయిన బిరియన్ అనే పదం నుంచి బిర్యానీ అనే పదం ఉద్భవించడం గమనార్హం. దేశంలో వేర్వేరు రకాల బిర్యానీలు అందుబాటులో ఉండగా వంట పద్ధతులను బట్టి బిర్యానీ తయారీలో వేర్వేరు విధానాలు అమలులో ఉన్నాయి. బిర్యానీ తినడం వల్ల శరీరానికి అవసరమైన కేలరీలు లభించే అవకాశం అయితే ఉంటుంది. బిర్యానీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2021 / 09:41 AM IST
    Follow us on

    మన దేశంలో బిర్యానీ ప్రియులు కోట్ల సంఖ్యలో ఉంటారనే సంగతి తెలిసిందే. మాంసం ప్రియులు బిర్యానీని ఎంతగానో ఇష్టపడతారు. పెర్షియన్ పదం అయిన బిరియన్ అనే పదం నుంచి బిర్యానీ అనే పదం ఉద్భవించడం గమనార్హం. దేశంలో వేర్వేరు రకాల బిర్యానీలు అందుబాటులో ఉండగా వంట పద్ధతులను బట్టి బిర్యానీ తయారీలో వేర్వేరు విధానాలు అమలులో ఉన్నాయి. బిర్యానీ తినడం వల్ల శరీరానికి అవసరమైన కేలరీలు లభించే అవకాశం అయితే ఉంటుంది.

    బిర్యానీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ను అందించే అవకాశం ఉంటుంది. మసాలా దినుసులతో పాటు అల్లం, నల్ల మిరియాలు, జీలకర్ర, పసుపు ఉపయోగించి బిర్యానీని తయారు చేయడం జరుగుతుంది. బిర్యానీని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడే అవకాశం ఉంటుంది. బిర్యానీలో ఉండే సుగంధ ద్రవ్యాలు రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.

    సుగంధ ద్రవ్యాలు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేయడంతో పాటు బిర్యానీ తయారీలో ఎంతగానో ఉపయోగపడతాయి. మంచి ఆహారం తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడటంతో పాటు మానసిక ఆరోగ్యం లభించే అవకాశం ఉంటుంది. ఎవరైతే బిర్యానీ తింటారో వాళ్లు నూతనోత్తేజంతో పని చేస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విరివిగా వినియోగించే పదార్థాల సాయంతో బిర్యానీని తయారు చేస్తారు.

    హైదరాబాద్ బిర్యానీ బాగా ఫేమస్ కాగా ఈ మధ్య కాలంలో మండీ బిర్యానీ నగరవాసులను నోరూరిస్తుండటం గమనార్హం. మండీ బిర్యానీ పూర్తిస్థాయిలో పోషక విలువలు ఉన్న ఆహారం కావడం గమనార్హం. మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ బిర్యానీ ప్రత్యేకత అని చెప్పవచ్చు.