https://oktelugu.com/

అల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

మనలో చాలామంది నిద్ర లేచిన వెంటనే టీ తాగుతారు. అయితే సాధారణ టీ కంటే అల్లం టీ తాగితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆయుర్వేద నిపుణులు సైతం అల్లం టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని అల్లం టీ తాగాలని సూచనలు చేస్తున్నారు. అల్లం టీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన మినరల్స్ తో పాటు మెగ్నీషియం, విటమిన్ సి లభిస్తాయి. అల్లంలో ఉండే జింజరాల్స్, జింజెరాన్‌లు రక్తప్రసరణకు ఎంతగానో తోడపడతాయి. దేశంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2021 9:31 am
    Follow us on

    మనలో చాలామంది నిద్ర లేచిన వెంటనే టీ తాగుతారు. అయితే సాధారణ టీ కంటే అల్లం టీ తాగితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆయుర్వేద నిపుణులు సైతం అల్లం టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని అల్లం టీ తాగాలని సూచనలు చేస్తున్నారు. అల్లం టీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన మినరల్స్ తో పాటు మెగ్నీషియం, విటమిన్ సి లభిస్తాయి.

    అల్లంలో ఉండే జింజరాల్స్, జింజెరాన్‌లు రక్తప్రసరణకు ఎంతగానో తోడపడతాయి. దేశంలో టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండగా రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో అల్లం తోడ్పడుతుంది. ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల దగ్గు, జలుబు ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. అల్లం టీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చేకూరేలా చేస్తుంది.

    అయితే అల్లం టీని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని ఎక్కువ మోతాదులో అల్లం టీని తీసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభాలు ఉండవని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో అల్లం టీని తీసుకోవడం వల్ల కడుపు మంట, చికాకుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం అయితే ఉంటుంది. అల్లం టీ తాగడం వల్ల రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు సైతం దూరమవుతాయి.

    ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడే అవకాశం అయితే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని హానికర బ్యాక్టీరియాను తొలగించడంలో అల్లం టీలో ఉండే జింజిబర్ తోడ్పడుతుంది. ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల వికారం, అలసట లాంటి సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది.