Homeఅంతర్జాతీయంWorld Rarest Disease in Girls: ఆకలి తెలియదు.. రోజులో రెండు గంటలే నిద్ర.. ఈ...

World Rarest Disease in Girls: ఆకలి తెలియదు.. రోజులో రెండు గంటలే నిద్ర.. ఈ అరుదైన వ్యాధి ప్రపంచంలో ఉన్నది ఈమెకు మాత్రమే!

World Rarest Disease in Girls: వాస్తవానికి సరిపడా నిద్ర లేకపోతే.. కడుపునిండా తినకపోతే మనం ఆరోజు మొత్తం తీవ్ర నిస్సత్తువతో ఉంటాం. అప్పుడప్పుడు అనారోగ్యానికి కూడా గురవుతుంటాం. అందువల్లే కంటి నిండా నిద్ర.. కడుపునిండా ఆహారం ఉండాలి అంటారు. కాకపోతే ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు.. వ్యాధుల బారిన పడినప్పుడు నిద్ర పట్టదు. ఆకలి అనిపించదు. అయితే వాటికి తగ్గట్టుగా మందులు వాడితే ఆరోగ్యం సర్దుకుంటుంది. కానీ ఈ కథనంలో ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఆమె రోజులో రెండు గంటలు మాత్రమే పడుకుంటుంది. ఆమెకు ఆకలి అనేది ఉండదు. నొప్పి అనేది తెలియదు.. ఈ తరహా వ్యాధి ఉన్నది ప్రపంచంలో ఈ బాలిక ఒక దానికి మాత్రమే.

Also Read: Sugar: 30 రోజులు చక్కెర మానేస్తే శరీరానికి ఏమవుతుంది? హార్వర్డ్ వైద్యుడు వెల్లడించాడు

ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓలీవియా అనే బాలికకు 13 సంవత్సరాలు. ఈమె జననం సాధారణంగానే జరిగింది. అయితే అందరి ఆడపిల్లల లాగా ఈమె ప్రవర్తన ఉండేది కాదు. ఆకలి అని చెప్పేదికాదు. ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి అని అరిచేది కాదు. చివరికి తన బుగ్గ గిల్లినా.. నొప్పి అని చెప్పేదికాదు. పైగా రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్రపోయేది. ఆకలి అని అడిగేది కూడా కాదు.. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆస్పత్రులలో చూపించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె పరీక్షించిన వైద్యులు అత్యంత అరుదైన క్రోమోజోమ్ డిజార్డర్ ఉన్నట్టు తేల్చారు. ఆకలి లేకపోవడం.. నొప్పి అంటే ఏంటో తెలియకపోవడం.. నిద్ర రెండు గంటలు మాత్రమే పోవడం.. ఇలాంటి మూడు లక్షణాలున్న వ్యాధి కలిగిన ఏకైక వ్యక్తి ఒలీవియా అని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అందువల్లే ఆమెను బయోనిక్ గర్ల్ అని పిలుస్తున్నారు.

Also Read: Eating After 9 PM: రాత్రి 9 తర్వాత తినడం ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!

“ఆమెకు ఆకలి వేయదు. నిద్ర కూడా పట్టదు. నొప్పి అంటే ఏంటో కూడా తెలియదు. ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం కారుతున్నా ఆమెకు ఏమీ అనిపించదు.. అందువల్లే ఆమె ఎదుగుదల అంతంతమాత్రంగానే ఉంది. నిద్ర పట్టకపోయినప్పటికీ ఆమె శరీరంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. ఆకలి వేయకపోయినప్పటికీ.. ఆమెకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు గుర్తించి ఆమెకు ఆహారం అందిస్తూ ఉంటారు.ప్రస్తుతం ఆమె పాఠశాలలో చదువుకుంటున్నది. అయితే ఆమె శారీరక ఎదుగుదల ఊహించిన స్థాయిలో లేదు. క్రోమోజోములలో అపసవ్య దిశ ఉండడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఇలాంటి లక్షణాలు ప్రపంచంలో కేవలం ఒలివియాలో మాత్రమే ఉన్నాయి. అయితే వీటికి ఎటువంటి ఔషధాలు అంటూ లేవు. క్రోమోజోమ్ థెరపీ వంటివి నిర్వహించినప్పటికీ ఈమె ఆరోగ్యంలో మార్పు వస్తుంది అనుకోవడంలేదని” శాస్త్రవేత్తలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular