Pak Minister Viral Statement on India: ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్ధి ఎలా చెందాలి అనే విభాగంలో పోటీపడుతుంటాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఇంకా గొప్పగా ఎలా ఎదగాలి అని ఆలోచిస్తుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా ఎలా గొప్పగా అభివృద్ధి చెందాలి అని ఆలోచిస్తుంటాయి. పేద దేశాలు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ఆలోచిస్తుంటాయి. కానీ పాకిస్తాన్ మాత్రం అలా ఆలోచించదు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులు దానిని అలా ఆలోచించనివ్వరు. ఎంతసేపటికి ఉన్మాదం.. ఉగ్రవాదం.. వికృతం అనే దిశగానే వారి ఆలోచనలు సాగుతూ ఉంటాయి. అందువల్లే అభివృద్ధి చెందాల్సిన పాకిస్తాన్ అధమ స్థాయిలో ఉంది. గొప్పగా ఎదగాల్సిన పాకిస్తాన్ దిక్కుమాలిన దేశం గా మారిపోయింది. కనీసం ఆ దేశంలో స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. మూడుపూటల ప్రజలకు ఆహారం లభించడం లేదు. ఇక ఉగ్రవాదుల కార్యకలాపాలకైతే అక్కడ లెక్కలేదు. సామాన్యుల ప్రాణాలకు గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఏ మూలన దాడి జరుగుతుందో తెలియదు. ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు. ఎవరు చనిపోతారో తెలియదు. అందువల్లే ఆ దేశాన్ని ఎవరూ నమ్మరు. పైగా ఆ దేశానికి పరపతి లేకపోవడంతో అప్పులు కూడా పుట్టడం లేదు.
Also Read: Pakistan : పాకిస్తాన్ దగ్గర మొత్తం ఎన్ని క్షిపణులు ఉన్నాయి? ఒకేసారి ఎన్ని ప్రయోగించగలదు?
హ్యాకింగ్ చేశారట..
ఇటీవల ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు.. విపత్కర పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో భారత ప్రభుత్వం నిర్ణయం మేరకు బిసిసిఐ ఐపీఎల్ ను తాత్కాలికంగా వాయిదా వేసింది. ముఖ్యంగా పంజాబ్ – ఢిల్లీ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ ను అర్ధాంతరంగా నిలిపివేసింది. ఆ తర్వాత మైదానంలో ఉన్న అభిమానులను యుద్ధ ప్రాతిపదికన వారి వారి స్వస్థలాలకు పంపించింది. ధర్మశాల అనేది ఉగ్రవాద దేశానికి సరిహద్దుగా ఉంటుంది. పైగా ఆ సమయంలో ఉగ్రవాద దేశం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ఏదైనా జరగరానిది జరిగితే మైదానంలో ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి కాబట్టి ముందు జాగ్రత్తగానే బీసీసీఐ ఆ మ్యాచు రద్దు చేసింది. ఆ తర్వాత అభిమానులను బయటికి పంపించింది.
Also Read: Pakistan Vs India: మా ప్రధాని, ఆర్మీ చీఫ్ చేతగనివాళ్లు.. పాక్ ఎంపీ ఆగ్రహం వీడియో వైరల్!
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ మాత్రం చెత్త వ్యాఖ్యలు చేశాడు..” గత నెల 8న పంజాబ్ – ఢిల్లీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ను ఆగేలా చేసాం. మా దేశాన్ని చెందిన వారియర్లు ఇండియా మీద దాడి చేశారు. ఆ మైదానంలో ఉన్న విద్యుత్ దీపాలను నిలుపుదల చేశారు. ఏ కాదు డ్యాం లు హ్యాక్ చేసి ఉన్నట్టుండి నీటిని విడుదల చేశారు. అంతేకాదు భారతదేశంలో ఎలక్ట్రిసిటీ గ్రిడ్ షట్ డౌన్ అయ్యేలా చేశారు. అందువల్లే ఇండియాలో అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని బట్టి మా దేశం ఎలా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవాలి. మా దగ్గర కూడా అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయి. అనితర సాధ్యమైన ఆలోచనలు ఉన్నాయని” పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తినడానికి తిండి లేదు కాని.. ఇలాంటి వ్యాఖ్యలకు కొదవలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.