Women’s life : ఈ కారణాల వల్ల మహిళల ఆయుష్షు తగ్గుతుందట?

ఆరోగ్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసికంగా సంతోషంగా లేకపోవడం వంటివి కూడా ప్రభావం చూపుతున్నాయా? మరి మీకు ఏం అనిపిస్తుందో కామెంట్ చేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 9, 2024 9:33 pm
Follow us on

Women’s life : పురుషుల కంటే మహిళల ఆయుష్షు ఎక్కువగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల మహిళల ఆయుష్షు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ప్రపంచంలో ఏదైనా గొప్పది ఉందా అంటే అది అమ్మ అని అందరూ చెబుతారు. తల్లి ఎన్నో కష్టాలను ఒపికపట్టి పిల్లలకు జన్మనిస్తుంది. మహిళలకు పెళ్లి, పిల్లలు అయిన తర్వాత బాడీలో చాలా మార్పులు వస్తాయి. కొందరు బరువు పెరగడం, తగ్గడం, నల్లగా మారడం, జుట్టు రాలిపోవడం ఇలా ఒకటేంటి పిల్లలు తర్వాత అమ్మాయిలు పూర్తిగా మారిపోతారు. ఇవన్నీ జరుగుతాయని తెలిసిన ప్రతీ తల్లి బిడ్డకు జన్మినిస్తుంది. పుట్టిన తర్వాత వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అయితే మహిళల పిల్లలకు జన్మనివ్వడం వల్ల వారి ఆయుష్షు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భం దాల్చిన ప్రతీసారి అమ్మాయిలు 2.4 నుంచి 2.8 బయోలాజికల్‌ ఏజ్‌ను కోల్పోతారని కొలంబియా యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో తేలింది.

పిల్లలను కనని వారు చాలా యంగ్‌గా కనిపిస్తారు. డెలివరీ అయిన మహిళల్లో మార్పుల వల్ల వారి వయస్సులో కూడా ఛేంజస్ కనిపిస్తాయి. పిల్లలకు జన్మినిచ్చిన వారితో పోలిస్తే జన్మనివ్వని వారు యంగ్‌గా కనిపిస్తారు. డెలివరీ అయిన వారు కాస్త వయస్సు పైబడిన వారిలా కనిపిస్తారని కొలంబియా యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. దీనిలో భాగంగా మొత్తం 1735 మంది యువతులపై పరీక్షలు చేయగా ఈ విషయాలు తెలిశాయి. ఎక్కువ మంది పిల్లలను కన్న మహిళల్లో బయోలాజికల్ ఏజ్‌లో మార్పులు వచ్చాయి. కానీ పురుషుల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదని ఈ అధ్యయనాలు తెలిపాయి. ముఖ్యంగా మహిళల్లో గర్భధారణ, పిల్లలకు పాలు పెట్టడం వంటి వాటివల్ల కూడా మహిళలు ఆయుష్షు మీద ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలను కంటే వాళ్ల ఆయుష్షును వారే తగ్గించుకుంటారు. అయితే కొందరు తక్కువ వయస్సులో పిల్లలను కనడం వల్ల ఇంకా ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు అంటున్నారు.

ఈ రోజుల్లో చాలా మంది ఒక సంతానంతో ఆగిపోతున్నారు. కానీ పూర్వం రోజుల్లో ఒక్కోరు డజను మంది పిల్లలను కనేవారు. కానీ ఆ రోజుల్లో మహిళలు ఎక్కువ కాలం జీవించేవారు. ఈ రోజుల్లో ఇన్ని సౌకర్యాలు ఉన్నా పట్టుపట్టి కనీసం 50 నుంచి 60 ఏళ్లు బతకడం కూడా కష్టమే అవుతుంది. పూర్వం రోజుల్లో ఎక్కువ మంది పిల్లలను కని కూడా బతికేవారు. వీటిన్నింటికి మన జీవినశైలి, ఆహార అలవాట్లు కారణం అంటారా? ఆరోగ్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసికంగా సంతోషంగా లేకపోవడం వంటివి కూడా ప్రభావం చూపుతున్నాయా? మరి మీకు ఏం అనిపిస్తుందో కామెంట్ చేయండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా ఈ విషయాలను తెలియజేయడం జరిగింది.