Emotional affair : ఎమోషనల్ ఎఫైర్ అంటే ఏమిటి? దాంపత్య బంధంపై ప్రభావం చూపుతుందా?

కానీ ఎమోషనల్ ఎఫైర్ మాత్రం చాలా కష్టం. వాళ్లు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే భవిష్యత్తులో మానసిక సమస్యలను కూడా ఎదుర్కొంటారు.

Written By: NARESH, Updated On : October 9, 2024 9:39 pm
Follow us on

emotional affair : బంధంలో శారీరకం కంటే ఎమోషనల్ అనేది చాలా ముఖ్యం. శారీరకం అంటే వాళ్లు మనతో ఉంటేనే సంతోషంగా ఉంటాం. వాళ్లను గుర్తుపెట్టుకుంటాం. అదే మానసికంగా అంటే మనిషి మీతో లేకపోయిన మానసికంగా వాళ్లనే గుర్తుపెట్టుకుంటారు. శారీరకంగా కనెక్ట్ అయిన వ్యక్తిని జీవితంలో ఎప్పుడైనా మర్చిపోవచ్చు. కానీ మానసికంగా కనెక్ట్ అయిన వ్యక్తిని జీవితంలో అసలు మర్చిపోరు. అయితే ఈరోజుల్లో బంధాల మధ్య ఎఫైర్లు ఎక్కువయ్యాయి. జనరేషన్ మారడం వల్ల గతంలో కంటే ఈ మధ్య ఎక్కువగా ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం, ప్రేమించిన వ్యక్తిని వదిలి ఉండలేక, పెళ్లయిన తర్వాత భర్త లేదా భార్య సరిగ్గా లేదని కొందరు ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. ఒకవేళ భాగస్వామితో కలిసి ఉన్న తెలియకుండా వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉంటున్నారు. ఇలాంటి కారణాల వల్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా విడాకులు తీసుకుంటున్నారు. దీంతో యువత కూడా పెళ్లికి నిరాకరిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా ఎమోషనల్ ఎఫైర్ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఎమోషనల్ ఎఫైర్ అంటే ఏమిటి? ఈ ఎఫైర్ వల్ల దాంపత్య బంధం ఇబ్బందుల్లో పడుతుందా? పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

కొందరు భాగస్వామితో ప్రేమగా, సంతోషంగా ఉంటారు. కానీ అన్ని విషయాలను షేర్ చేసుకోరు. వాళ్లు ఏవైనా విషయాలు ఎమోషనల్‌గా షేర్ చేసుకోవడానికి వేరే వ్యక్తి ఉంటారు. భాగస్వామితో కాకుండా వేరే వ్యక్తితో ఎమోషనల్‌గా కనెక్ట్ కావడాన్ని ఎమోషనల్ ఎఫైర్ అంటారు. ఈ రోజులు ఎలా అయ్యాయంటే.. ప్రేమగా చూసుకునే భాగస్వామి ఉన్న పట్టించుకోరు. ఇంకా ఎక్కడో ప్రేమను వెతుక్కుంటారు. భాగస్వామి పక్కన ఉన్న వాళ్లకు ఉన్న ఫీలింగ్స్‌ను చెప్పరు. ఎక్కడో ఉన్న వ్యక్తితో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల బంధంలో సంతోషం ఉండదు. గొడవలు ప్రారంభమవుతాయి. ఇంట్లో భోజనం చేసిన, సినిమా చూసిన కూడా భాగస్వామితో కాకుండా మొబైల్‌లో ఇతరులతో సమయం గడిపితే భాగస్వామిని అనుమానించాల్సిందే. రోజులో మీతో పది నిమిషాలు అయిన గడపడానికి ఇష్టం లేకపోవడం, భాగస్వామితో బయటకు వెళ్లకుండా ఇతరులతో వెళ్లడం వంటివి చేస్తే కాస్త డౌట్ పడాలి.

భాగస్వామితో సమయం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మీ భాగస్వామికి మీరు ఇష్టం లేకపోతేనే వద్దు అంటారు. అయితే నిజాలు తెలుసుకోకుండా భాగస్వామితో గొడవ పడవద్దు. నిజంగానే మీ భాగస్వామికి ఎవరితోనైనా ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉంటేనే కూల్‌గా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. నిజనిజాలు తెలియకుండా తప్పుపడితే.. సమస్య పెద్దది అయ్యి విడిపోయే స్టేజ్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎమోషనల్ ఎఫైర్ ఉన్నవారు ఎక్కువగా ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తారు. వాళ్ల కోసమే మాట్లాడతారు. అసలు వారిని ఒక్క క్షణం కూడా మర్చిపోరు. ఈ స్టేజ్‌లో మీ భాగస్వామి ఉంటే ప్రేమతోనే వారిని మార్చడానికి ప్రయత్నించండి. అప్పుడే వైవాహిక బంధం సంతోషంగా ఉంటుంది. లేకపోతే ఇంకా సమస్య పెరిగి జీవితాంతం దూరంగా ఉండాల్సి వస్తుంది. శారీరక ఎఫైర్ ఏదో రకంగా మాన్పించవచ్చు. కానీ ఎమోషనల్ ఎఫైర్ మాత్రం చాలా కష్టం. వాళ్లు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే భవిష్యత్తులో మానసిక సమస్యలను కూడా ఎదుర్కొంటారు.