https://oktelugu.com/

Do you want to lose weight: బరువు తగ్గాలని ఉందా.. అయితే పీరియడ్స్ తర్వాత ఇవి తీసుకోండి

సాధారణంగా అమ్మాయిలు బరువు పెరుగుతారు. తీసుకునే ఫుడ్ మాత్రమే కాకుండా హార్మోన్ల వల్ల అమ్మాయిల బాడీలో మార్పులు వస్తాయి. మహిళలు డెలివరీ తర్వాత తొందరగా బరువు పెరుగుతారని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఎక్కువగా పురుషుల కంటే మహిళలే తొందరగా బరువు పెరుగుతారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 10, 2024 / 01:31 AM IST

    How-to-lose-weight

    Follow us on

    Do you want to lose weight: స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. కాస్త బొద్దుగా ఉన్న బరువు ఎక్కువగా ఉన్నామని ఫీల్ అయ్యి.. బరువు తగ్గడానికి ప్లాన్ చేస్తుంటారు. దీనికోసం డైట్ ఫాలో అవ్వడం, జిమ్‌కి వెళ్లడం, వాకింగ్, రన్నింగ్ వంటివి ఎన్నో చేస్తారు. ఈరోజుల్లో ఎక్కువగా ఫాస్ట్‌ఫుడ్స్ తినడం, పోషకాలు లేని పదార్థాలు తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతున్నారు. ఎక్కువ శాతం మంది ఇలా ఎక్కడ ఏం దొరికితే అది తినడం వల్ల అనారోగ్యమైన కొవ్వులను శరీరంలో పెంచుకుంటున్నారు. దీనివల్ల ఊబకాయం, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొందరికి అయితే ఇంట్లో వండిన ఫుడ్ నచ్చకపోవడం వల్ల డైలీ బయట తినడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వర్క్ బిజీ, ఇంట్లో పనుల వల్ల సులువుగా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. తినాల్సిన బయట ఫుడ్ అంతా తినేస్తున్నారు. మళ్లీ బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ జనరేషన్‌లో ఇది కామన్ అయిపోయింది. అయితే అమ్మాయిలు సులువుగా బరువు తగ్గాలంటే తిండి మానేయడం, జిమ్ వంటివి చేయక్కర్లేదు. పీరియడ్స్ అయిన పది రోజులు ఈ పదార్థాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారట. మరి తినాల్సిన ఆ పదార్థాలేంటో చూద్దాం.

    సాధారణంగా అమ్మాయిలు బరువు పెరుగుతారు. తీసుకునే ఫుడ్ మాత్రమే కాకుండా హార్మోన్ల వల్ల అమ్మాయిల బాడీలో మార్పులు వస్తాయి. మహిళలు డెలివరీ తర్వాత తొందరగా బరువు పెరుగుతారని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఎక్కువగా పురుషుల కంటే మహిళలే తొందరగా బరువు పెరుగుతారు. అయితే మహిళలు బరువు తగ్గడానికి పీరియడ్స్ అయిన పది రోజులు తప్పకుండా ఈ పదార్థాలు తింటే ఇట్టే బరువు తగ్గుతారు. పీరియడ్స్ అయిన తర్వాత అంటే 6వ రోజు నుంచి 14వ రోజు వరకు మహిళలు తక్కువ కేలరీలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. తక్కువ కేలరీలు ఉండే పదార్థాలను సాధారణంగా తీసుకున్న కూడా బరువు తగ్గుతారు. అలాంటిది పీరియడ్స్ తర్వాత కేలరీలు ఉండే పదార్థాలను తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారు. దీంతో పాటు వ్యాయామం కూడా చేస్తుంటే ఇంకా త్వరగా బరువు తగ్గే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. తక్కువగా కేలరీలు ఉండే దుంపలు, మొక్కజొన్న, పచ్చి బఠానీలు, కూరగాయలు, పీచు పదార్థాలు, పండ్లు, ఎక్కువగా నీరు తాగడం, ప్రొటీన్స్ ఉండే పదార్థాలు తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారు. వీటితో పాటు తక్కువ కేలరీలు ఉండే చేపలు, చికెన్, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, కిడ్నీ బీన్స్, చియా సీడ్స్, పెరుగు, బ్రోకలీ వంటివి తీసుకున్న తొందరగా బరువు తగ్గుతారు. వాటర్ ఎక్కువగా ఉండే దోసకాయ, పుచ్చకాయ వంటివి తినాలి. పుట్ట గొడుగులు, స్ట్రాబెర్రీలు వంటి వాటిలో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని వారానికొకసారి తింటే ఈజీగా బరువు తగ్గుతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.