అమెరికాలో అదుపు తప్పిన పరిస్థితి.. ఒక్కరోజులో లక్ష కరోనా కేసులు..?

కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కాలంలో అమెరికాలో కరోనా కేసులు క్రమంగా తగ్గాయి. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి మళ్లీ అదుపు తప్పింది. అమెరికాలో మళ్లీ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ మరోసారి కరోనా కేసుల్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం గమనార్హం. అమెరికాలో గతంలో ఒక్కరోజే 91 వేల కేసులతో అత్యధిక కేసులకు సంబంధించి […]

Written By: Navya, Updated On : October 31, 2020 9:19 pm
Follow us on


కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కాలంలో అమెరికాలో కరోనా కేసులు క్రమంగా తగ్గాయి. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి మళ్లీ అదుపు తప్పింది. అమెరికాలో మళ్లీ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ మరోసారి కరోనా కేసుల్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం గమనార్హం.

అమెరికాలో గతంలో ఒక్కరోజే 91 వేల కేసులతో అత్యధిక కేసులకు సంబంధించి రికార్డ్ ఉంది. అయితే తాజాగా అమెరికా ఆ రికార్డును సునాయాసంగా అధిగమించింది. గత 24 గంటల్లో అక్కడ కొత్తగా 1,00,233 మందికి కరోనా నిర్ధారణ కావడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్న సమయంలో అమెరికాలో భారీగా కరోనా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం.

ఇండియాలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ప్రజలు మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలో ఇప్పటివరకు 9 మిలియన్ కేసులు నమోదయ్యాయి.

అమెరికా జనాభాలో 3 శాతం మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసులు అమెరికాలో 31 రాష్ట్రాల్లో నమోదయ్యాయని సమాచారం. అమెరికాలో ప్రతి 10,000 మందిలో ఏడుగురు కరోనాతో చనిపోతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.