Wine Bottle Size : వైన్ బాటిల్ లో 750 మిల్లీ లీటర్లే ఎందుకుంటుందో తెలుసా?

ఒక గ్లాసులో 60 మిల్లీ లీటర్ల వైన్ పోస్తే అందులో సోడాకానీ నీళ్లు కానీ పోస్తే గ్లాసులో నుంచి పొంగిపోకుండా ఉంటుందని చెబుతారు. అందుకే పలు దేశాల కోసం ఇలా తయారు చేశారని చెబుతుంటారు.

Written By: Srinivas, Updated On : May 7, 2023 7:24 pm
Follow us on

Wine Bottle Size : మనలో చాలా మందికి మందు అలవాటు ఉంటుంది. ఇందులో విస్కీ, వైన్, బీరు తదితర రకాలు ఉన్నాయి. దీంతో మద్యం సేవించే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. దీనివల్ల రోగాలు కూడా పెరుగుతున్నాయి. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నిత్యం మందు తాగుతూ తూలుతున్నారు. ప్రభుత్వాలకు కూడా మద్యం ద్వారానే ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో మందు తాగడం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమైనట్లు తెలుస్తోంది.

మందులో వైన్ కూడా ఒక రకమైన మద్యం. ఇది 750 మిల్లీ లీటర్ల సామర్థ్యంతో ఉంటుంది. అన్ని లీటర్ ఉంటే ఇది మాత్రం తక్కువగా ఉండటంలో ఓ లాజిక్ ఉంది. వైన్ 1000 మిల్లీలీటర్లకు బదులు 750 మిల్లీ లీటర్లు ఎందుకుంటుందో తెలియదు. ఇలా ఎందుకు ఉంటుందో అనే దానిపై ఓ కారణం కూడా ఉంది. వైన్ ఫ్రాన్స్ లో తయారవుతుంది.

ఫ్రాన్స్ లో భోజన సమయంలో వైన్ తాగడం అలవాటు ఉంటుంది. ఒక వ్యక్తికి 6 పెగ్ లు పోస్తారు. ఒక పెగ్ 60 మిల్లీ లీటర్లు ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఆహారం తీసుకుంటే 12 పెగ్గులు అంటే 720 మిల్లీలీటర్లు ఉంచుతారు. దీంతో ఒకో బాటిల్ లో 750 మిల్లీ లీటర్ల వైన్ పోస్తారు. కొంత ఒలికిపోయినా మిగిలేది 720 మిల్లీ లీటర్ల వరకు ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తారట. ఈ సులభమైన చిట్కా ఎవరికి తెలియదు. ఏదో తాగుతారు. వైన్ బాటిల్ లో అంతే ఉండటానికి కారణం అదే.

ఇలా తయారు చేయడం వెనుక మరో కారణం కూడా ఉందట. ఒక గ్లాసులో 60 మిల్లీ లీటర్ల వైన్ పోస్తే అందులో సోడాకానీ నీళ్లు కానీ పోస్తే గ్లాసులో నుంచి పొంగిపోకుండా ఉంటుందని చెబుతారు. అందుకే పలు దేశాల కోసం ఇలా తయారు చేశారని చెబుతుంటారు. మద్యపానం హానికరం అని చెబుతూనే మద్యం తయారు చేసి విక్రయించడం గమనార్హం.