Homeహెల్త్‌Feeling drunk without alcohol causes: మద్యం తాగకపోయినా.. మత్తుతో ఉంటున్నాడు.. ఎందుకంటే..

Feeling drunk without alcohol causes: మద్యం తాగకపోయినా.. మత్తుతో ఉంటున్నాడు.. ఎందుకంటే..

Feeling drunk without alcohol causes: మద్యపానం చేయకపోయినా నిరంతరం మత్తులో తూలుతున్న ఒక వ్యక్తికి సంబంధించిన వార్త ఇప్పుడు వైద్య ప్రపంచంలో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనిషికి మత్తు కలుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అతనికి అత్యంత అరుదైన ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ (Auto-Brewery Syndrome) అనే వింత వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధితో అతడు మద్యం తీసుకోకపోయినా మత్తులో ఉంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

అసలేం జరిగింది?
కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఎటువంటి మద్యం సేవించకపోయినా నిత్యం కళ్లు తిరిగి పడిపోవడం, మత్తుగా అనిపించి స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో బాధపడేవాడు. దీనిని చూసిన చుట్టుపక్కల వారు, కొందరు పోలీసులు అతడిని చూసి మద్యం తాగి ఉన్నాడని భావించి పలుమార్లు ఇబ్బందులకు గురిచేశారు. నిరంతరం ఇలా జరుగుతుండటంతో అతను తీవ్ర వేదనకు లోనయ్యాడు. చివరకు వైద్య నిపుణుల దగ్గరకు వెళ్లినప్పుడు, అతని రక్త పరీక్షల్లో ఆల్కహాల్ స్థాయిలు మద్యం తాగిన వ్యక్తికి సమానంగా ఉండటాన్ని చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత వైద్య పరీక్షలు చేయగాఅతడికి ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ ఉన్నట్లు గుర్తించారు.

ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ అంటే ఏమిటి?
ఈ వ్యాధిని ‘గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ ప్రక్రియ ద్వారా శక్తిగా మారుతుంది. అయితే, ఈ సిండ్రోమ్ ఉన్నవారి జీర్ణవ్యవస్థలో అసాధారణమైన మార్పులు జరుగుతాయి. వీరి పేగుల్లో ఉండే ఈస్ట్ లేదా కొన్ని రకాల బ్యాక్టీరియా, మనం తీసుకునే కార్బోహైడ్రేట్లు, చక్కెరలను ఆల్కహాల్‌గా మార్చేస్తాయి. దీనివల్ల ఆ వ్యక్తి బయట ఎక్కడా మద్యం సేవించకపోయినా, అతని రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు పెరుగుతాయి.

శరీరమే ఒక ‘బ్రూవరీ’లా..
ఈ వ్యాధి ప్రభావం వల్ల ఆ వ్యక్తి జీర్ణవ్యవస్థే ఒక మద్యం తయారీ కేంద్రంలా మారుతుంది. అందుకే దీనికి ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ అని పేరు వచ్చింది. అతను బంగాళదుంపలు, బియ్యం లేదా చక్కెర ఉన్న పదార్థాలు తిన్న ప్రతిసారీ, ఆ ఆహారం కడుపులో పులిసి నేరుగా ఆల్కహాల్‌గా మారుతుంది. ఇది ఆ వ్యక్తి రక్తంలో కలిసి నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది, తద్వారా అతను మత్తులో ఉన్నట్లు ప్రవర్తిస్తాడు.

చికిత్స మరియు నివారణా మార్గాలు:
ఈ అరుదైన వ్యాధికి శాశ్వత నివారణ కష్టమైనప్పటికీ, సరైన నియమాలతో అదుపులో ఉంచుకోవచ్చు. వైద్యులు ఆ వ్యక్తికి కార్బోహైడ్రేట్లు లేని లేదా చాలా తక్కువగా ఉండే డైట్‌ను సూచించారు. దీనితో పాటు, శరీరంలోని అదనపు ఈస్ట్ పెరుగుదలను అరికట్టేందుకు యాంటీ-ఫంగల్ మందులను అందిస్తున్నారు. ఈ చికిత్స ద్వారా అతని జీర్ణవ్యవస్థను సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అతను మెరుగైన ఆరోగ్యంతో ఉన్నాడని వైద్యులు వెల్లడించారు.

ఈ తరహా అరుదైన ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే నిపుణులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version