White beard : వాతావరణం కాలుష్యం, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా నేటి కాలంలో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో చాలా మంది చిన్న వయసులోనే పెద్ద పెద్ద జబ్బులకు గురవుతున్నారు. ప్రస్తుతం పురుషులు ఎక్కువగా బాధపడుతున్న సమస్య వైట్ హెయిర్స్. 30 ఏళ్ల దాటకముందే చాలా మందికి తలపై తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. అలాగే గడ్డం కూడా పూర్తి వయసు రాకముందే తెల్లగా మారిపోతుంది. ఈ సమస్యతో చాలా మంది ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో కొందరు తెల్ల వెంట్రుకలను నల్లగా మారేందుకు రకరకాల రసాయనాలు వాడుతున్నారు. అయితే వాటితో పని లేకుండా చిన్న చిట్కాల ద్వారా నల్ల జుట్టు తెల్లగా కాకుండా ఉంచుకోవచ్చు.
చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడానికి ప్రధాన కారణం ఎక్కువగా ఒత్తిడి అని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు ఏదో ఒక విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో వైట్ హెయిర్ సమస్య ఏర్పడుతుంది. అయితే వైట్ హెయిర్ కనిపించకుండా రసాయనాలు వాడడం వల్ల తాత్కాలికంగానే ఉపశమనం కలుగుతుంది. శాశ్వతంగా బ్లాక్ హెయిర్స్ కావాలంటే ఈ చిట్కాలు పాటించవచ్చు.
కొందరు రెగ్యులర్ గా తలపై స్నానం చేస్తారు.కానీ ఆయిల్ మాత్రం అప్లై చేయరు. హెయిర్స్ కు కోకోనట్ ఆయిల్ మంచి ఆహారం లాంటిది. అయితే కోకోనట్ ఆయిల్ తో పాటు నిమ్మకాయ ఆకుల మిశ్రమం కలిపిన మిశ్రమం జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందు కోసం కొబ్బరి నూనెను వేడి చేసి దానిలో కొన్ని నిమ్మ ఆకులను కలపాలి. ఆ మిశ్రమాన్ని తెల్లగా ఉన్న గడ్డంపై అప్లయ్ చేయాలి. ఇలా 30 నిమిషాలు ఉంచి ఆ తరువాత కడగండి.
జుట్టు నల్లగా మార్చడానికి జామ ఆకు పొడి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. జామ ఆకు పొడిని నీటితో కలిపి పేస్టులా చేసి గడ్డానికి అప్లయ్ చేసి 30 నిమిషాలు ఉంచాలి. వీటితో పాటు పౌష్టికాహారం కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడిని ఎదుర్కోకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. లేకుంటే ఒత్తిడి కారణంగా జుట్టు తెల్లగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.