sleep : మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనది. ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్లకి అలవాటు పడి ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కరోజు మనిషికి నిద్ర లేకపోతే నీరసంగా అయిపోయి, దేని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టలేరు. రాత్రంతా హ్యాపీగా నిద్రపోవాలంటే పొజిషన్ కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడే ప్రశాంతంగా నిద్రపోతారు. అయితే మనలో చాలామందికి ఎటు వైపు తిరిగి నిద్రపోవాలో తెలియదు. మనం నిద్రపోయే పొజిషన్ బట్టి హాయిగా నిద్ర పట్టడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎటు వైపు తిరిగి నిద్రపోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
సాధారణంగా ఒక్కోరు ఒక్కో పొజిషన్‌లో నిద్రపోతారు. అయితే ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయం, క్లోమగ్రంథి మన శరీరంలో ఎడమ వైపు ఉంటాయి. ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. భోజనం తర్వాత కుడి వైపు కాకుండా ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిది. శరీరంలో ముఖ్యమైన గుండె కూడా ఎడమ వైపు ఉంటుంది. అటు తిరిగి నిద్రపోవడం వల్ల రక్తప్రసరణ సులభంగా జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణులు అయితే ఎడమ వైపు మాత్రమే తిరిగి నిద్రపోవాలి. ఇలా పడుకున్నప్పుడు పిండానికి, గర్భాశయానికి సరిగ్గా రక్తప్రసరణ జరుగుతుంది. అలాగే కడుపులోని బిడ్డకు పోషకాలు అందుతాయి.
నిద్రపోయేటప్పుడు కొందరు ఎక్కువగా గురక పెడుతుంటారు. ఎడమ వైపు నిద్రపోవడం వల్ల గురక సమస్య తగ్గుతుంది. శ్వాస నాళాలు మెరుగుపడుతుంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న వారికి ఎడమ వైపు నిద్రపోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. అలాగే అయాసం కూడా తగ్గుతుంది. అదే ఎడమ వైపు కాకుండా కుడివైపు నిద్రపోవడం వల్ల చేతులు నొప్పిగా మారతాయి. కాబట్టి వీలైనంత వరకు ఎడమవైపు మాత్రమే తిరిగి నిద్రపోండి. ఇలా పడుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మన పెద్దలు మాత్రం కొన్ని దిశల్లో మాత్రమే తలపెట్టి నిద్రపోవాలని అంటుంటారు. ముఖ్యంగా తూర్పు లేదా దక్షిణం వైపు తల పెట్టి నిద్రపోతే మంచి జరుగుతుందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. ఉత్తర, పడమర వైపు తల పెట్టి నిద్రపోవడం వల్ల సరిగ్గా నిద్ర పట్టదని, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ఈరోజుల్లో కొందరు ఇప్పటికీ ఈ నియమాలను పాటిస్తే.. మరికొందరు వీటిని అసలు పాటించరు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.