https://oktelugu.com/

Horoscope Today: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు డబ్బు కొదవ ఉండదు..

కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితం ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 30, 2024 / 07:53 AM IST

    Horoscope Today(1)

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సిద్ధయోగం ఏర్పడనుంంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా డబ్బు వచ్చి చేరుతుంది. మరికొన్ని రాశుల వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    వ్యాపారులు కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    వృషభ రాశి:
    కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితం ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది.

    మిథున రాశి:
    కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు ఉంటాయి. కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఉద్యోగులు అధిక ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    కర్కాటక రాశి:
    మానసికంగా ఆందోళనతో ఉంటారు. దూర ప్రయాణాలు ఉంటాయి. కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం. సాయంత్రం పాత స్నేహితులను కలుస్తారు. విద్యార్థుల విషయంలో శుభవార్తలు వింటారు.

    సింహారాశి:
    వాణిజ్యంతో సంబంధం ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన చిక్కులు ఉండే అవకాశం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగుల ముందు ఉన్న కొన్ని డిమాండ్లు పరిష్కారం అవుతాయి.

    కన్య రాశి:
    పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. పెండింగ్ పనులను పూర్తి చే్తారు. ఆరోగ్యానికి కావాల్సిన ఆహారం తీసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు.

    తుల రాశి:
    ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం. పెద్దల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. సాయంత్రి కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు.

    వృశ్చిక రాశి:
    మానసికంగా గందరగోళంతో ఉంటారు. విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    ధనస్సు రాశి:
    విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

    మకర రాశి:
    కుటుంబ విషయాలపై ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
    కుంభరాశి:
    వాదనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో బిజీగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం మానేయండి.

    మీనరాశి:
    వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక కారణాల వల్ల జీవిత భాగస్వామికి దూరంగా ఉంటారు. మనసులో ఆందోళన కలుగుతుంది. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.