Shaik Rasheed: ఇండియాలోని స్పోర్ట్స్‌కు ముఖ్యంగా క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ఒక్కరు కంపల్సరీగా క్రికెట్ గురించి చర్చించుకుంటుంటారు. తాజాగా అండర్-19 టీమిండియా వైస్-కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ అయిన షేక్ రషీద్ టీమిండియా గెలుపునకు చేసిన కృషి గురించి తెలుసుకుని క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనను అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే అతని ఆట గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలో, అండర్-19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలోనూ రషీద్ పాత్ర చాలా కీలకమైందని, ఆయన్ను తెగ పొగిడేస్తున్నారు. గేమ్‌లో నాకౌట్ మ్యాచుల్లో అద్భుతంగా రాణిస్తూ 17 ఏళ్ల రషీద్ అందరినీ ఆకట్టుకుంటు ముందుకు సాగుతున్నాడు. తెలుగు వాడు అయిన రషీద్ ఇలా ఆటలో ముందుకు వెళ్తుండటం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కూరలో ఉప్పు, కారం ఎక్కువైందా.. ఈ సింపుల్ చిట్కాతో తగ్గించొచ్చు తెలుసా?
రషీద్.. ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం మల్లయ్యపాలెంలో జన్మించారు. ప్రజెంట్ గుంటూరు సిటీలో ఉంటున్నారు. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. భారత యువజట్టు తరఫున సత్తా చాటడంలో ఆయన చాలా కష్టపడుతున్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన షేక్ రషీద్..అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తూ తన క్రికెట్ కెరీర్‌ను మెరుగుపరుచుకుంటుండటం పట్ల స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం గర్వపడేలా షేక్ రషీద్ కృషి చేస్తున్నాడని ప్రశంసిస్తున్నారు.

ఇకపోతే షేక్ రషీద్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన సంగతి అందరికీ విదితమే. ఆ టోర్నీని యువ భారత జట్టు గెలుచుకోవడంతో క్రీడాభిమానులు సంతోష పడిపోయారు. బంగ్లాదేశ్ జట్టు మీద సెమీస్‌లో 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు షేక్ రషీద్.. అతని ఆటను చూసి క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఫైనల్స్‌లోనూ రషీద్ సత్తా చాటాడు. శ్రీలంక మీద ఇండియా సాధించిన విజయంలో రషీద్ కీ రోల్ ప్లే చేశాడు. లక్ష్య ఛేదనలో 31 రన్స్ చేసిన నాటౌట్‌గా నిలిచారు. అంతకు ముందు మ్యాచుల్లో ఓ రకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన రషీద్… కీలకమైన మ్యాచుల్లో తానేంటో నిరూపించుకున్నారు. అలా ఇంపార్టెంట్ మ్యాచుల్లో రాణిస్తున్న రషీద్‌ను అందరూ అభినందిస్తున్నారు.
Also Read: సిరి ధాన్యాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ వ్యాధులకు సులువుగా చెక్!