Headache: తలనొప్పి, తలనొప్పి.. చాలా మందికి కామన్ గా వచ్చే సమస్య. ఈ సమస్యను ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు. అందరికీ ఆల్మోస్ట్ తలనొప్పి వస్తుంది. కానీ ఇందులో కొన్ని రకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమస్య వచ్చిందంటే చాలు తగ్గాలని ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అయితే ఈ తలనొప్పి తగ్గాలని పెద్దగా టెన్షన్ తీసుకోకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మీ తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. మెయిన్ గా మీరు హోమ్ రెమెడీస్ వాడండి చాలు సులభంగా మీ తలనొప్పి పోతుంది. మరి దీనికోసం ఏం చేయాలంటే?
తలనొప్పి రావడానికి చాలా రకాల కారణాలే ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, సరిలేని ఆహారం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వంటి సమస్యలు మాత్రమే కాదు. మరిన్నొ సమస్యల వల్ల కూడా ఈ తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా కళ్ళు అదే పనిగా చూడడం, హైబీపీ, మైగ్రేన్స్, సైనస్, జలుబు, ధూమపానం, కాలుష్యం.. వంటివి మొత్తం కూడా తలనొప్పికి కారణమయ్యే సమస్యలు. అయితే, ఈ తలనొప్పిని తగ్గించేందుకు కొన్ని మార్గాలు పాటిస్తే చాలు మీరు తలనొప్పి నుంచి రిలీఫ్ గా ఉండవచ్చు.
డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వస్తుంది కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడటానికి నీటిని ఎక్కువగా తాగండి. వీటితతో పాటు హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. అల్లం టీ, లెమన్ టీల వంటివి రక్తనాళాల వాపుని తగ్గిస్తాయి. అంతేకాదు వికారాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
కొంతమంది చూయింగ్ గమ్‌ని నములుతుంటారు. దీని వల్ల దవడ ప్రాంతం, బుగ్గల లోపలం భాగంలో నొప్పి వచ్చి ఆ తర్వాత తలనొప్పి తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. అందుకే మెత్తని ఆహారాలు తినాలి. జుట్టుని టైట్‌గా వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా చేస్తే కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి, జడని లూజ్‌గా వేసుకుని తలపై మెల్లిగా మసాజ్ చేసుకోండి. దీని వల్ల చాలా వరకూ రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. నుదురు, మెడపై మెల్లిగా మసాజ్ చేయడ వల్ల ఒత్తిడితో వచ్చే టెన్షన్ తలనొప్పి తగ్గుముఖం పడుతుంది అంటున్నారు నిపుణులు. ఎసెన్షియల్ ఆయిల్‌తో కనుబొమ్మలు, నుదుటిపై మసాజ్ చేసినా సరే మంచి రిజల్ట్ ఉంటుంది. దీనివల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. పుదీనా, తులసి, లావెండర్ నూనెలు వీటికి చాలా హెల్ప్ అవుతాయి.
తలనొప్పి ఉంటే ఏ పని చేయకుండా కాస్త రిలాక్స్ అవండి. పనిని పక్కన పెట్టండి. వీలైతే ఓ చీకటి గదిలో 1, 2 గంటలు పడుకోవడం బెటర్. మొబైల్స్, గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించడం, రెస్ట్ తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. కొన్ని సార్లు అధిక వేడి కారణంగా కూడా తలనొప్పి పెరుగుతుంది. కాబట్టి, నుదుటిపై కోల్డ్ ప్యాక్‌ని అప్లై చేయండి. ఐస్ ప్యాక్స్‌ని మెత్తని గుడ్డలో పెట్టి నుదుటిపై పెట్టుకొని అప్లే చేస్తూ ఉండండి. 15 నిమిషాల వరకూ ఇలానే చేస్తే తలనొప్పి తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల తలతిరగదు. మాట్లాడటంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే ఆ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..