Whatsapp: దేశంలో స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్న వాళ్లలో దాదాపుగా అందరూ వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ నిర్వాహకులు సైతం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వాట్సాప్ యూజర్లకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాట్సాప్ యాప్ కొన్నిరోజుల క్రితం డిస్ అపియరింగ్ మెసేజెస్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.
వాట్సాప్ తెచ్చిన ఈ ఫీచర్ వల్ల యూజర్లు అనవసమైన మెసేజ్ లు వాటంతట అవే డిలీట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అయితే డిస్ అపియరింగ్ మెసేజెస్ ఆన్ లో ఉన్నా ఫోటోలు, వీడియోలు ఫోన్ లోనే సేవ్ అవుతూ ఉండటంతో ఈ ఫీచర్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే వాట్సాప్ తాజాగా ఈ ఫీచర్ లో కీలక మార్పు చేసి యూజర్లకు ప్రయోజనం చేకూరేలా చేసింది.
వాట్సాప్ ఈ ఫీచర్ ను యూజర్ల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో నిర్దిష్ట సమయం తర్వాత సందేశాలు డిలీట్ అయ్యేలా చేయవచ్చు. అయితే వాట్సాప్ కొత్తగా తెచ్చిన అప్ డేట్ వల్ల వాట్సాప్ యూజర్లకు ఆటో డౌన్ లోడ్ మోడ్ డిసేబుల్ కానుందని సమాచారం అందుతోంది. డిస్ అపియరింగ్ చాట్ లో ఒక్కోదాన్ని క్లిక్ చేస్తే మాత్రమే సేవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
వాట్సాప్ డిస్ అపియరింగ్ మెసేజెస్ ఫీచర్ ద్వారా పర్సనల్ చాట్ తో పాటు గ్రూప్ చాట్ లను కూడా కనిపించకుండా చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కాంటాక్ట్ నేమ్ పై క్లిక్ చేసి డిస్ అపియరింగ్ మెసేజెస్ ఫీచర్ ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూపులలో గ్రూప్ చాట్ కు సంబంధించిన మెసేజ్ లను తొలగించే అధికారం కేవలం అడ్మిన్లకు మాత్రమే ఉంటుంది.