AP New Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ కుంపటి రగులుతూనే ఉంది. ముఖ్యమంత్రి జగన్ తీసుకునన నిర్ణయానికి అందరు మంత్రులు పెదవి విరుస్తున్నారు. తమకు పదవులు దక్కకపోతే ఇక అంతే సంగతి అని అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీంతో కొరివితో తలగోక్కున్నట్లుగా ఉందని జగన్ అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి లేని సమస్య తెచ్చుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో పాత వారికే తివాచి పరచాల్సిన అవసరం ఏర్పడింది.
ఏదైనా నిర్ణయం తీసుకుంటే మొండిగానే వ్యవహరించే జగన్ ఈ విషయంలో మెత్తబడినట్లు కనిపిస్తోంది. సీనియర్ మంత్రుల ఆగ్రహానికి బలి కావాల్సి వస్తోంది. ఫలితంగా కొందరిని ఉన్నపళంగా మంత్రివర్గంలోకి తీసుకునేందుకే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అంశం జగన్ కు షాక్ తెప్పిస్తోంది. అసంతృప్తులను బుజ్జగించే పనిలో సజ్జల ఉన్నట్లు సమాచారం.
సీనియర్ మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, కొడాలి నాని లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో పాత మంత్రుల్లో దాదాపు 15 మందిని తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, చెల్లబోయిన వేణు, శంకర్ నారాయణ, గుమ్మనూరు జయరాం తదితరులు పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో పాతవారితోనే కొత్త మంత్రివర్గం నిండిపోనుందని సమాచారం. దీనికి ఇంత కసరత్తు ఎందుకు ఇంతటి ప్రచారమెందుకు అనే వాదనలు కూడా వస్తున్నాయి.
మంత్రివర్గ పున్వవస్థీకరణపై ఎన్నో రోజులుగా ఊరించి కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్లు గా జగన్ పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా తయారయింది. పాత వారిని తీసుకుంటే కొత్త వారికి, కొత్త వారికి అవకాశమిస్తే పాత వారికి ఆగ్రహం వస్తున్నందున ఇప్పుడు ఏం చేయాలనే మీమాంసలో పడిపోయారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ కత్తి మీద సాములా మారింది జగన్ కు. ఈ క్రమంలో ఎల్లుండి ఎవరిని పిలుస్తారో ఎవరిని సాగనంపుతారో తెలియడం లేదు.