Summer Heat: భరించలేనంత ఉక్కపోత నుంచి ఉపశమనానికి ఏం చేయాలి?

అందరి ఇంటిలో ఏసీలు ఉండవు. కాబట్టి కూలర్లు, ఫ్యాన్ల కింద మాత్రమే కూర్చోవాలి. కానీ రోజంతా వీటి వాడకం వల్ల మరింత వేడి గాలి వస్తుంటుంది. సో ఇబ్బంది పడకతప్పదు.

Written By: Swathi, Updated On : April 5, 2024 2:51 pm

What should be done to relieve the unbearable heat

Follow us on

Summer Heat: వామ్మో సమ్మర్ వచ్చేసింది ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా ఫుల్ వేడిగా అనిపిస్తుంటుంది. కూలర్ గాలి కూడా వేడిగానే అనిపిస్తుంది. ఏం చేయాలో తోచని ఈ స్థితిలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఎండాకాలం ఎందుకు వచ్చింది అని తిట్టుకుంటారు. మరి భరించలేనంత ఉన్న ఈ ఉక్కపోత నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్నారా? ఓ సారి చదివేసేయండి.

అందరి ఇంటిలో ఏసీలు ఉండవు. కాబట్టి కూలర్లు, ఫ్యాన్ల కింద మాత్రమే కూర్చోవాలి. కానీ రోజంతా వీటి వాడకం వల్ల మరింత వేడి గాలి వస్తుంటుంది. సో ఇబ్బంది పడకతప్పదు. అయితే మీ కూలర్లో వాటర్ ను పోయడం వల్ల కాస్త వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. భరించలేని ఉక్కపోతలో మధ్యమధ్యలో వచ్చి నీటిచుక్కలు తగులుతుంటే ఒళ్లు పులకరించిపోతుంటుంది. సో కూలర్ లో నీళ్లు పోయడానికి బద్దకంగా ఉంటే కాస్త విడిచిపెట్టండి. ఇక మీకు సొంత ఇల్లు ఉంటే ఓ చిట్కా పాటించండి.

గోనె సంచులు ఉంటే.. వాటిని మీ బిల్డింగ్ మీద లేదా రేకుల మీద పరవండి. డే అంట అవి వేడిగా అవుతాయి. సాయంత్రం సమయానికి వాటి మీద వాటర్ పోయండి. సో రాత్రి మీకు చల్లటి గాలి వస్తుంటుంది. రేకుల ఇంటికి ఈ టిప్ మరింత ఎక్కువగా పనిచేస్తుంటుంది. రోజు సాయంత్రం పడుకునే ముందు స్నానం చేసి పడుకోండి. ఉదయం చేయడమే బద్దకం అనుకుంటే సాయంత్రమా అనుకుంటున్నారా? అయితే వేడిని భరించాల్సిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతలో, చెమటతో ఇబ్బంది పడుతున్నవారు స్నానం చేయాల్సిందే.

స్నానం వల్ల రాత్రి హాయిగా నిద్ర పడుతుంది. కుదిరితే ఏసీ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని మర్చిపోకండి. ఇక చెట్ల కింద, లేదా ఆరుబయట ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా బయటకు వెళ్తే వాటర్ తాగడం మర్చిపోకండి. వేడి వస్తువులు తినడం వల్ల మరింత వేడిగా అనిపిస్తుంది సో హీట్ వస్తువులను ఎండాకాలంలో బ్యాన్ చేయండి. జ్యూస్ లను ఎక్కువగా తీసుకోండి. దీని వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. సో మీరు వేడి నుంచి కాస్త భయటపడుతారు.