Virtual intimacy: ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఎక్కడ చూసిన అందరూ కూడా సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. గతంలో ఎవర్ని అయిన ఇష్టపడితే గులాబీ పువ్వులు లేదా గిఫ్ట్‌లతో ఎదురుగా వారి ప్రేమను వ్యక్త పరిచేవారు. కానీ ఈరోజుల్లో ప్రేమను వ్యక్త పరచడం కూడా డిజిటల్ అయిపోయింది. ఆఖరికి రొమాన్స్ కూడా డిజిటల్ అయిపోయింది. ఒకరి ఇష్టాలను కూడా డిజిటల్‌గానే తెలియజేస్తున్నారు. వాళ్ల ప్రేమను, భావాలను అన్నింటికి కూడా ఎదురుగా కాకుండా సోషల్ మీడియా ద్వారా అంటే స్టేటస్, స్టోరీలు పెట్టడం, వీడియో కాల్‌లో చెప్పడం జరుగుతోంది. అయితే మొత్తం కూడా డిజిటల్ అయిపోవడం వల్ల ఎదురెదురుగా మాట్లాడుకునే భావాలు అన్ని ఇలా మారాయి. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది వర్చువల్ సాన్నిహిత్యాన్ని ఫాలో అవుతున్నారు. ఇంతకీ వర్చువల్ సాన్నిహిత్యం అంటే ఏమిటి? ఇలాంటి రిలేషన్స్ ఎక్కువ కాలం ఉంటాయా? అనే విషయాలు తెలుసుకుందాం.
వర్చువల్ సాన్నిహిత్యం అంటే?
సాధారణంగా ఏదైనా బంధంలో శారీరకంగా, మానసికంగా సంబంధం కలిగి ఉంటారు. అదే ఇప్పుడు అంతా డిజిటల్ యుగం కదా. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్ ద్వారా బంధాన్ని కొనసాగించడాన్ని వర్చువల్ సాన్నిహిత్యం అంటారు. ఎక్కువ శాతం మంది ఈరోజుల్లో ఇలాంటి బంధాన్నే కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత కారణాలు, కెరీర్, ఆఫీస్ వర్క్ కోసం కొందరు భాగస్వాములు దూరంగా ఉంటారు. ఇలా దూరంగా ఉన్నప్పుడు ఎదురెదురుగా కాకుండా మెసేజ్‌లు, వీడియో కాల్స్ ద్వారా వారి ప్రేమను కొనసాగిస్తారు. చాలా మంది కలిసి మాట్లాడి, హత్తుకునే ఫీల్ అయితే వర్చువల్ సాన్నిహిత్యంలో ఉన్నవారు ఇలా వీడియో కాల్స్, మేసేజ్‌ల ద్వారా వారి ప్రేమను ఫీల్ అవుతారు. అందరూ చుట్టూ ఉన్న వారితో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారు. ఎదురుగా ఉంటే సిగ్గుపడతారు. కానీ అదే ఆన్‌లైన్ ద్వారా అయితే ఫ్రీగా మాట్లాడతారు. కరోనా తర్వాత ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఈ రోజుల్లో చాలామంది డేటింగ్ యాప్‌లు వాడటం వంటివి కూడా చేస్తున్నారు. వర్చువల్‌గా సంబంధాలు పెరగడంతో వాళ్ల బిజీ దృష్ట్యా ఎక్కువశాతం మంది వర్చువల్ సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
బంధం నిలకడగా ఉంటుందా?
దూరంగా ఉన్న జంటలు ఎక్కువగా వర్చువల్ సాన్నిహిత్యాన్ని పాటిస్తారు. చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా వారి దూరాన్ని తగ్గించుకుంటారు. అయితే ఈ వర్చువల్ సాన్నిహిత్యం వల్ల డోపమైన రిలీజ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామి నుంచి ఏదైనా సందేశం వస్తే.. డోపమైన హార్మోన్ విడుదల అవుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం ఇంకా పెరుగుతుంది. అలాగే సెరటోనిన్ హార్మోన్ విడుదల అయ్యి.. లైంగిక కోరికలు కూడా పెరుగుతాయి. వీటితో పాటు ఆక్సిటోసిన్ కూడా విడదల అవుతుంది. ఇది ఉత్సాహంగా ఉండటం చేయడంతో పాటు బంధాన్ని బలపరచడంలో బాగా సహాయపడుతుంది. ఈ వర్చువల్ సాన్నిహిత్యం ద్వారా లైంగిక కోరికలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.