https://oktelugu.com/

Delayed pregnancy?: ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతోందా? అయితే ఇలా చేయండి

పెళ్లయిన మొదటి ఏడాది తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే వారిని ఎలిజిబుల్ కపుల్ అంటారు. అదే పెళ్లయిన ఏడాది తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వారిని ఇన్‌ఫెర్టిలిటీ కపుల్ అని అంటారు. పెళ్లయిన తర్వాత ఏడాది పాటు కలయికలో పాల్గొన్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 6, 2024 / 12:01 AM IST

    Delayed-pregnancy

    Follow us on

    Delayed pregnancy?: మారిన జీవనశైలి వల్ల చాలామంది ఈరోజుల్లో సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. కేవలం మహిళలు మాత్రమే కాకుండా పురుషుల్లో కూడా ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. పెళ్లి అయి ఏళ్లు గడుస్తున్న కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదు. వీటిన్నింటికి ముఖ్యకారణం డైలీ లైఫ్ కారణమని వైద్య నిపుణులు అంటున్నారు. ఈరోజుల్లో ప్రతి వస్తువులో కల్తీ ఉంటుంది. అన్ని పంటలను రసాయనాలు వేసి పండించిన కూరగాయలు, పండ్లు వంటి వాటిని తినడం వల్ల సంతానలేమి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. కొందరు మహిళలకు థైరాయిడ్ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవి కూడా సంతాన సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడికి గురై మానసికంగా సంతోషంగా లేకపోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ ఆలస్యం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.

    పెళ్లయిన మొదటి ఏడాది తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే వారిని ఎలిజిబుల్ కపుల్ అంటారు. అదే పెళ్లయిన ఏడాది తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వారిని ఇన్‌ఫెర్టిలిటీ కపుల్ అని అంటారు. పెళ్లయిన తర్వాత ఏడాది పాటు కలయికలో పాల్గొన్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్న వెంటనే డాక్టర్ మీకు తెలియజేస్తారు. దీనివల్ల మీరు కాస్త ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ప్రెగ్నెన్సీ రావాలంటే ఎక్సర్‌సైజ్ వంటివి చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల బాడీ శారీరకంగా స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల తొందరగా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు అధిక బరువు ఉంటారు. అధిక బరువు ఉన్నావారికి ప్రెగ్నెన్సీ రావడం కాస్త కష్టమే. ఎందుకంటే ఊబకాయం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటివల్ల ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది. కాబట్టి బరువు ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి.

    ముఖ్యంగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పోషకాలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తృణధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, డ్రైఫూట్స్ వంటివి అధికంగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇవి అండం ఏర్పడటానికి కూడా బాగా సహాయపడుతుంది. బయటకు వెళ్లినప్పుడు వేయిచిన పదార్థాలు వంటివి తీసుకోకూడదు. అన్నింటి కంటే ముఖ్యంగా ఒకసారి కలిస్తే ప్రెగ్నెన్సీ రాదు. వారానికి కనీసం రెండు నుంచి మూడు రోజుల పాటు కలయికలో పాల్గొనడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎగ్ రిలీజ్ అయ్యే సమయానికి కలిస్తే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇవన్నీ చేయడంతో పాటు ఆల్కహాల్, పొగతాగడం వంటి వాటికి దూరంగా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.