https://oktelugu.com/

Eating Sweets : ఈ సమయంలో స్వీట్లు తింటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు 

తిన్న వెంటనే స్వీట్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఆలోచించరు. నచ్చిందని తినేస్తారు. అయితే స్వీట్స్ ఏ సమయంలో తినాలో కూడా తెలీదు. మరి వీటిని రోజులో ఏ సమయంలో తినాలో తెలుసుకుందాం. 

Written By:
  • Srinivas
  • , Updated On : September 16, 2024 / 11:35 PM IST

    Eating Sweets

    Follow us on

    Eating Sweets :  చాలా మందికి స్వీట్స్ అంటే ఇష్టం. వీటిని ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసిన కూడా వీటిని ఎక్కువగా తింటారు. వీటిని అధికంగా తినడం వల్ల షుగర్ రావడంతో పాటు బరువు కూడా పెరుగుతారు. అయితే కొందరు స్వీట్స్ ని ఇష్టం వచ్చినప్పుడు తింటుంటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలామందికి భోజనం చేసిన తరువాత స్వీట్ ఏదయినా తినాలనిపిస్తుంది. తిన్న వెంటనే స్వీట్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఆలోచించరు. నచ్చిందని తినేస్తారు. అయితే స్వీట్స్ ఏ సమయంలో తినాలో కూడా తెలీదు. మరి వీటిని రోజులో ఏ సమయంలో తినాలో తెలుసుకుందాం.

     స్వీట్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయిన కొందరు తింటుంటారు. అయితే వీటిని వ్యాయామానికి ఒక 30 నిమిషాల ముందు తినడం మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. ఎందుకు అంటే స్వీట్స్ తిన్న వెంటనే వ్యాయామం చేయడం వల్ల కేలరీలు కరిగిపోతాయి. అయితే కొందరు రాత్రి పూట భోజనం తర్వాత తింటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. మధ్యాహ్న భోజనం చేశాక ఒక మూడు గంటల తర్వాత స్వీట్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. అయితే స్వీట్స్ ను మధుమేహం ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు.రాత్రి పూట భోజనం తర్వాత స్వీట్స్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీంతో తొందరగా బరువు పెరుగుతారు. ఇలా అధికంగా బరువు ఉండటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె సమస్యలు, క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలామందికి స్వీట్స్ తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఇది చివరకు డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. అలాగే చక్కెర పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మూత్ర పిండాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి స్వీట్స్ కి దూరంగా ఉండండి. అలాగే పంచదారను కూడా తక్కువగా వాడటం మంచిది. దీనికి బదులు బెల్లం వాడితే ఐరన్ మెరుగుపడుతుంది. అలాగే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.

    చక్కెర ఉన్న పదార్థాలు తినడం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. స్వీట్స్ ఎక్కువగా తింటే కొందరికి నిద్ర పట్టదు. అలాగే దంత సమస్యలు కూడా వస్తాయి. వీటితో పాటు కడుపు నొప్పి, అజీర్తి వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది. చక్కెర తినడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. దీనివల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అలాగే ముడతలు, మొటిమలు కూడా ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీటిని తినడం తగ్గించండి. అవసరమైతే బెల్లం వాడండి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.