సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో దొరికే కూరగాయలలో టమోటాలు ముందువరసలో ఉంటాయి. దాదాపు అన్ని వంటకాల్లో టమోటాను వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. టమోటాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. టమోటాలు కూరకు అదనపు రుచిని ఇస్తాయి కాబట్టి అందరూ వీటిని తినడానికి ఆసక్తి చూపుతారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ సమస్యలకు చెక్ పెట్టడంలో టమోటాలు సహాయపడతాయి.
Also Read: మధుమేహాన్ని వేగంగా తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..?
బీటా కెరాటిన్ ఎక్కువగా ఉండే టమోటాలను తీసుకోవడం వల్ల జుట్టు, చర్మం, అధిక బరువు సమస్యలు దూరమవుతాయి. ఒబెసిటీని తగ్గించడంలో కూడా టమోటాలు సహాయపడతాయనే సంగతి తెలిసిందే. టమోటాలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో టమోటాలు సహాయపడతాయి. చాలామంది గుండె సంబంధిత వ్యాధుల వల్ల బీపీతో బాధ పడతారు.
Also Read: క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
టమోటాలో ఉండే పొటాషియం గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో టమోటాలు సహాయపడతాయి. టమోటా విత్తనాలు తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పౌడర్ రూపంలో లేదా నూనె రూపంలో టమాటా గింజలను తీసుకోవచ్చు. అయితే టమోటా గింజలు తీసుకుంటే అపెండిసైటిస్ సమస్య వస్తుందని చాలామంది భావిస్తారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నా టమోటాలను తినడం వల్ల అపెండిసైటిస్ సమస్య వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. అయితే టమోటా గింజలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుండటం గమనార్హం