నేడు కేసీఆర్‌‌ కాళేశ్వరం టూర్‌‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌‌రావు కలల ప్రాజెక్టు కాళేశ్వరం. బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్‌‌ ఈ ప్రాజెక్టును నిర్మించారు. నేడు ఆ డ్రీమ్‌ ప్రాజెక్టును సందర్శించడానికి కేసీఆర్‌‌ వెళ్తున్నారు. Also Read: కొడాలి వర్సెస్ దేవినేని.. గొల్లపూడిలో గోలగోల..! ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక.. ప్రాజెక్టు సందర్శనకు ముందు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో పూజలు నిర్వహిస్తారు. Also Read: వైసీపీలో వారిదే […]

Written By: Srinivas, Updated On : January 19, 2021 11:13 am
Follow us on


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌‌రావు కలల ప్రాజెక్టు కాళేశ్వరం. బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్‌‌ ఈ ప్రాజెక్టును నిర్మించారు. నేడు ఆ డ్రీమ్‌ ప్రాజెక్టును సందర్శించడానికి కేసీఆర్‌‌ వెళ్తున్నారు.

Also Read: కొడాలి వర్సెస్ దేవినేని.. గొల్లపూడిలో గోలగోల..!

ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక.. ప్రాజెక్టు సందర్శనకు ముందు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో పూజలు నిర్వహిస్తారు.

Also Read: వైసీపీలో వారిదే పెత్తనం.. : జగన్‌ కొంపముంచేది వాళ్లేనట..!

అనంతరం 11.45 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. ఇదిలాఉంటే.. సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన సందర్శంగా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్