https://oktelugu.com/

night effect : ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎందుకు అలా జరుగుతుందో తెలుసా?

ఎక్కడికి అయినా వెళ్లినప్పుడు ఆ ప్లేస్ లో మొదటిసారిగా నిద్రించాలంటే ఫస్ట్-నైట్ ఎఫెక్ట్ (FNE)కు గురి అవుతారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈ ఫీల్ ను ఒకసారి అయినా అనుభూతి చెంది ఉంటారు. ఇంతకీ మీకు ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఓ క్లారిటీ వచ్చిందా? లేదు కదా.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 26, 2024 / 01:18 PM IST

    What is the first night effect? Do you know why that happens?

    Follow us on

    night effect : ఎక్కడికి అయినా వెళ్లినప్పుడు ఆ ప్లేస్ లో మొదటిసారిగా నిద్రించాలంటే ఫస్ట్-నైట్ ఎఫెక్ట్ (FNE)కు గురి అవుతారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈ ఫీల్ ను ఒకసారి అయినా అనుభూతి చెంది ఉంటారు. ఇంతకీ మీకు ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఓ క్లారిటీ వచ్చిందా? లేదు కదా. అయితే కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ సరిగ్గా నిద్ర పట్టకపోవడాన్ని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటారు. అయితే నిపుణులు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నారట. మామూలుగా మొదటి రాత్రి డేటాను విస్మరించి దీని మీద ఓ క్లారిటీకి వచ్చారు.

    పరిశోధనల తర్వాత వచ్చిన ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు నిపుణులు. మొదటి రాత్రి నిద్రలో, మెదడు ఎడమ వైపు కుడివైపు కంటే చాలా తక్కువగా నిద్రపోతున్నట్లు తేలిందట. రెండు అర్ధగోళాలు సమాన పరిమాణంలో నిద్రపోలేదు, అవి గమనించదగ్గ విభిన్న నమూనాలను ప్రదర్శించాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాథమిక చర్యలలో ఒకటి నిద్రపోవడానికి వ్యక్తి తీసుకునే సమయం. ఇది అర్ధగోళాల మధ్య అసమానత స్థాయిపై ఆధారపడి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, మెదడు రెండు వైపులు ఎంత భిన్నంగా ప్రవర్తిస్తాయో, ఒక వ్యక్తి తల వంచడానికి కూడా అంతే సమయం పడుతుందట.

    అయితే కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు నిద్ర పట్టిందా? అని చాలా మంది అడుగుతారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా?అది ఇందుకే. అదే నండి ఫస్ట్ నైట్ స్లీప్ ఎఫెక్ట్. తెలియని పరిసరాలలో నిద్రిస్తున్నప్పుడు, మనిషి మెదడులో సగం మాత్రమే విశ్రాంతి పొందుతుంది. ఈ విషయాన్ని బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైందట. ‘కుడివైపు కంటే ఎడమవైపు ఎక్కువ మేల్కొని ఉంటుందని తెలిపారు నిపుణులు. అందుకే కొత్త ప్రదేశంలో నిద్రించిన తర్వాత కొందరు అలిసిపోతుంటారు. దీనిని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అని పిలుస్తారట.

    దీని వల్ల మరుసటి రోజుకు సవాలుగా ఉంటుంది. ఉదయం కనురెప్పలు బరువుగా లేజీగా అనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్ కప్పు కాఫీతో కావాలి అనిపిస్తుంది. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అయితే ప్రాంతం కొత్తది కాబట్టి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ ఫీల్ చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. అందరిలో ఉండదు అంటున్నారు నిపుణులు. కానీ మీరు ఎక్కడ ఉన్న సరే మంచి నిద్ర రావడానికి వ్యాయామం, మంచి ఫుడ్ అవసరం అవుతాయి. ఇక రాత్రి పడుకునే ముందు కూల్ మ్యూజిక్ వింటే కూడా మీరు సూపర్ నిద్రతో మునిగితేలుతారు. సో నిద్ర మస్ట్ కాబట్టి జాగ్రత్త.

    పసుపు కలిపిన పాలను తాగితే చక్కని ఆరోగ్యంతో పాటు మంచి నిద్ర కూడా వస్తుంది. అందుకే నిద్రపోవడానికి ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగి ఆ తర్వాత బెడ్ ఎక్కేయండి. బాదంపాలు కూడా మంచి నిద్రను అందిస్తాయి. ఇందులో మంచి నిద్రకు తోడ్పడే పోషకాలు లభిస్తాయి. నిద్రలేమితో బాధపడుతుంటే బాదం పాలు తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చెర్రీస్లో మెలటోనిన్ ఎక్కువగా లభిస్తుంది. ఇవి కూడా మంచి నిద్రకు సహాయపడుతాయి. నిద్రకు ఒక గంట ముందు చెర్రీ రసం తాగి పడుకోండి.