https://oktelugu.com/

Rajinikanth , Pushpa : రజినీకాంత్ ను సైతం మెప్పించిన పుష్ప ట్రైలర్… తగ్గేదెలే అంటున్న తలైవా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్...ఈయన చేసిన సినిమాలు తెలుగులో మంచి విజయాలను సాధించడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో కూడా తన సత్తా చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

Written By: , Updated On : November 26, 2024 / 01:12 PM IST
The Pushpa trailer that also impressed Rajinikanth... Are you saying that it will go down?

The Pushpa trailer that also impressed Rajinikanth... Are you saying that it will go down?

Follow us on

Rajinikanth , Pushpa : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…ఈయన చేసిన సినిమాలు తెలుగులో మంచి విజయాలను సాధించడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో కూడా తన సత్తా చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు…

ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ‘పుష్ప 2’ హవానే కొనసాగుతుంది. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఇండియన్ అభిమాని ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ను రీసెంట్ గా చెన్నై లో నిర్వహించారు. వైల్డ్ ఫైర్ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక దాంతో తమిళనాడులో రజనీకాంత్ సైతం పుష్ప 2 సినిమా మీద కొన్ని కామెంట్లు చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ‘పుష్ప 2’ సినిమా చూడడానికి తను ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా మొత్తం ఇవే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సూపర్ స్టార్ సైతం ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నాడు అంటే పుష్ప రాజ్ మేనియా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ సక్సెస్ ని అందుకొని ఇండియాలో ఉన్న స్టార్ హీరోపందరికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే అల్లు అర్జున్ భారీ ప్రణాళిక రూపొందించుకొని మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే ఇండియాలో హీరోగా ఎదగడమే కాకుండా తెలుగు స్టార్ హీరోలందరిలో తను చాలా ప్రత్యేకమైన హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు.

మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. నార్త్ లో ఈ సినిమాకి ఇప్పటికే బ్రహ్మరథం పట్టే అభిమానులైతే ఉన్నారు. కాబట్టి సౌత్ లోనే ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. పుష్ప మొదటి పార్ట్ తెలుగులో అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.

బాలీవుడ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ గా నిలిచింది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాకి పెద్దగా అభిమానులైతే లేరనే చెప్పాలి. మరి పుష్ప 2 సినిమాకి మాత్రం తెలుగులో భారీ హైప్ అయితే క్రియేట్ అయింది.

ఇక సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుందనే ఉద్దేశ్యంతో సుకుమార్ భారీ కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నాడు. మరి తన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…