ఎంటర్టైన్మెంట్Dhee : ఢీ షో 2.0.. ఈసారి అంతకుమించి అట.. ఫైనల్స్ లో ఊహించని టర్న్

Dhee : ఢీ షో 2.0.. ఈసారి అంతకుమించి అట.. ఫైనల్స్ లో ఊహించని టర్న్

Dhee : సరికొత్త డాన్సింగ్ టాలెంట్‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ టాలెంటెడ్ షో ఏది అంటే ఠక్కున చాలా మందికి ఢీ షో గుర్తు వస్తుంది. ఈ షోకు వ‌స్తున్న ఆద‌ర‌ణ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బుల్లితెరపై ఢీ షో ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేసింది. ప్రతీ సీజన్‌కి ఓ కొత్త థీమ్, కొత్త యాంకర్లతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటుంది. ఈ విధంగా ఢీ షోకి ఉన్న రూపు రేఖలు ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. 2009లో ప్రారంభ‌మైంది ఈ డాన్స్ షో. అయితే ప్ర‌స్తుతం 18వ సీజ‌న్‌తో ప్రేక్ష‌కుల‌ను రంజింపు చేస్తోంది డీ షో. ద‌క్షిణాదిలోనే టీవీ రంగంలో టాప్ షోగా పాపులారిటీని సంపాదించుకుంది కూడా. అంతేకాదు ఇద జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

డాన్స్ ను ఫుల్ గా ఇష్టపడే అభిమానుల‌కు ఢీ షో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త టాలెంట్‌ను ప‌రిచ‌యం చేస్తుంటుంది. ఇలా అందరి మ‌న‌సుల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకుంది. 15కి పైగా కొరియోగ్రాఫ‌ర్స్‌ను తెలుగు చిత్ర సీమ‌కు అందించి త‌న‌దైన చెర‌గ‌ని ముద్ర వేసుకుంది ఈ ఢీ షో.

ఇదిలా ఉంటే ఇప్పటికే పలు సీజన్స్ విజయంతంగా పూర్తి చేసుకున్న ఈ ఢీ షో తాజా సీజన్ ఫైనల్స్ కి చేరుకుంది. అయితే ఈ షోకి గణేష్ మాస్టర్, నటి హన్సిక, శేఖర్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో లో కంటెస్టెంట్స్ అందరూ తమ తమ పర్ఫామెన్స్ లతో ప్రేక్షకులను మెస్తరైజ్ కూడా చేవారు. వారి డ్యాన్స్ తో అదరగొట్టారు. ఢీ ఫైనల్స్ ట్రోఫీ ఎవరికి దక్కుతుంది అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. అయితే ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా విన్నర్ కి ట్రోఫీ అందించడానికి టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వచ్చేసాడు.

విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ షో కి మెకానిక్ రాకీ పాత్రలోనే వచ్చాడు ఈ హీరో. రాగానే హన్సిక ను తన మాటలతో మాయ చేసేస్తాడు కూడా. ఇదిలా ఉంటే హైపర్ ఆది పంచ్ లకి రివర్స్ పంచ్ లు వేసి మరీ నవ్వులు పూయించాడు విశ్వక్ సేన్.

ఢీ గత సీజన్ల ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ లుగా చాలా మంది స్టార్ హీరోస్ వచ్చిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని ఇలా చాలా మంది స్టార్ హీరోస్ వచ్చి ఈ షోను మరో స్టేజ్ కు తీసుకొని వెళ్లారు. ఈ సీజన్ కి విశ్వక్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు..? ఎవరికి విశ్వక్ ట్రోఫీ అందిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమా నవంబర్ 22 న విడుదలైంది. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Dhee Vinayaka Chavithi Special: ఢీ 20 లో సరికొత్త లవ్ ట్రాక్..అన్షు రెడ్డి కి ప్రపోజ్ చేసిన రాజు మాస్టర్!

Dhee Vinayaka Chavithi Special: కొన్నేళ్ల క్రితం ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్(Jabardasth), ఢీ(Dhee 20) వంటి ఎంటర్టైన్మెంట్ షోస్ లో సుధీర్(Sudigaali sudheer), రష్మీ(Rashmi gautam) లవ్ ట్రాక్ పెద్ద హిట్...

Dhee 20 Mega Latest Promo : నువ్వు ఊ.. అంటే ఆరు సిక్సులే’, ఆమె మీద హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

Dhee 20 Mega Latest Promo : బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది పంచులు ఎంత నవ్వు తెప్పిస్తాయో అదే స్థాయిలో వివాదాలు రాజేస్తాయి. కాంటెంపరరీ, పొలిటికల్ ఇష్యూస్ మీద ఆయన...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Exit mobile version