Pride And Arrogance: చాదస్తం, అహంకారం ఏంటే ఏమిటి? ఇవి ఇప్పుడు వస్తాయి?

ప్రతి మనిషి ఎప్పుడైనా అందమైన జీవితం కోరుకుంటారు. మంచి జీవితం అంటే కావాల్సిన డబ్బ ఉండి.. స్నేహితులతో నిత్యం ఉల్లాసంగా ఉండడం కాదు.. ప్రపంచంలో జరిగే విషయాలు తెలిసి ఉండడం.. వాటి పట్ల అవగాహన ఉండడం.. అలాగే ఒక మనిషి మరో మనిషితో సత్సంబంధాలు కలిగి ఉండడం.. కానీ ఈ రెండు విషయాలు రోజులు పెరుగుతున్న కొద్దీ దూరమవుతున్నాయి. మనుషులు కేవలం డబ్బు మాత్రమే సంపాదిస్తూ.. బంధాలను మరిపోతున్నారు.

Written By: Srinivas, Updated On : October 28, 2024 12:02 pm

pride-and-arrogance

Follow us on

Pride And Arrogance: ప్రతి మనిషి ఎప్పుడైనా అందమైన జీవితం కోరుకుంటారు. మంచి జీవితం అంటే కావాల్సిన డబ్బ ఉండి.. స్నేహితులతో నిత్యం ఉల్లాసంగా ఉండడం కాదు.. ప్రపంచంలో జరిగే విషయాలు తెలిసి ఉండడం.. వాటి పట్ల అవగాహన ఉండడం.. అలాగే ఒక మనిషి మరో మనిషితో సత్సంబంధాలు కలిగి ఉండడం.. కానీ ఈ రెండు విషయాలు రోజులు పెరుగుతున్న కొద్దీ దూరమవుతున్నాయి. మనుషులు కేవలం డబ్బు మాత్రమే సంపాదిస్తూ.. బంధాలను మరిపోతున్నారు. ఇదే సమయంలో నిత్యం పనుల కారణంగా ప్రపంచంలో ఏం జరుగుతుంతో తెలుసుకోలేకపోతున్నారు. అయితే వీటిపై అవగాహన లేకపోవడంతో చాదస్తం, అహంకారం వస్తుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు?

ఒకప్పుడు రాజ్యాలను ఏలే రాజులు ముందు ప్రపంచమంతా చుట్టి వచ్చేవారు. అ అవకాశాన్ని యువరాజులకు కల్పించేవారు. ఈ సమయంలో లోకమంతా చుట్టి ప్రపంచంలో ఏ రాజ్యంలో? ఏం జరుగుతుందో తెలుసుకునేవారు. ఇలా చుట్టి రావడం లోక జ్ఞానం పెరుగుతుందని భావించేవారు. ఆ తరువాత రాజ్యాన్ని పాలించే సమయంలో ఏ కష్టం వచ్చినా ఎదుర్కునేవారు. నేటి కాలంలో ప్రతి వ్యక్తికి సమాజంపై అవగాహన ఉండాలి. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొనగలగాలి.

చాలా మంది స్కూలుకెళ్లే విద్యార్థులు నిత్యం చదువుపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. అలాగే కొందరు ఉద్యోగులు, వ్యాపారులు తమ పనుల్లోనే మునిగి లోకం గురించి మరిచిపోతున్నారు. దీంతో చాదస్తం పెరుగుతుంది. చాదస్తం వల్ల ఇతరులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంపై అవగాహన లేని వారు తాము చెప్పిందే వేదం అంటూ వాదిస్తారు. మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ వారు కష్టాల పాలవుతారు. అందువల్ల చాదస్తాన్ని దూరంగ చేయాలంటే ప్రతి వ్యక్తికి లోక జ్ఞానం తెలిసి ఉండాలి.

కొందరు ఆర్థికపరంగా సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థితికి వస్తారు. ఈ క్రమంలో వారి ప్రవర్తనలో అనుకోకుండా మార్పు వస్తుంది. తమ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తమకు ఇతరులతో పని లేదన్నట్లు వ్యవహరిస్తారు. ఈ క్రమంలో అహంకారంతో ఉంటారు. అయితే డబ్బు కంటే బంధాలు శాశ్వతం అని గ్రహించాలి. ప్రతి మనిషి మరొకరితో సంబంధం ఉండడం వల్ల కష్టనష్టాలను చెప్పుకునే వీలుంటుంది. అప్పుడప్పుడు బంధువులను కలవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. కొందరు వ్యక్తులతో సంబంధాలు కలవడం వల్ల వారి సాయంతో జీవితంలో లక్ష్యాలనుకూడా సాధించే అవకాశం ఉంది. అందువల్ల అహంకారాన్ని వీడి సంబంధాలు మెరుగుపడేందుకు కృషి చేయాలి.

అయితే లోక జ్ఞానం పొందాలంటే పూర్వ రోజుల్లో లాగా రాజ్యాలు చుట్టి రానక్కర్లేదు. మంచి పుస్తకం ద్వారా మంచి విషయాలు తెలుసుకొనగలగాలి. అందుబాటులో ఉన్న మాద్యమాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలి. తెలివైన వ్యక్తులతో స్నేహం చేయాలి. ఇక సంబంధాలు మెరుగుపడడానికి బంధువుల్లో జరిగే కార్యక్రమాలకు వెళ్తుండాలి. కుుటంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉండి అహంకారం మాయమైవుతుంది. ప్రతి మనిషి చాదస్తం, అహంకారం వీడడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటాడు. తన జీవితం సంతోషంగా ఉంటుంది