https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున కేవలం తమిళ్ హీరోల సినిమాల్లోనే అలా చేస్తారా..? లేదంటే తెలుగు సినిమాల్లో కూడా చేస్తారా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సక్సెస్ లను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు... యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక కథను నమ్మే ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు సాగుతున్నారు...ఇక ఏది ఏమైనా కూడా తమను తాము మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం ఎవ్వరైనా సరే భారీ సక్సెస్ లు కొట్టాల్సిన అవసరం అయితే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 / 12:14 PM IST

    Akkineni Nagarjuna

    Follow us on

    Nagarjuna: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్న నటుడు నాగార్జున…ఇక ఇండస్ట్రీ లో మొదటి నుంచి కూడా అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే రజనీకాంత్ ‘కూలీ ‘ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే ధనుష్ సినిమాలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను మినహాయిస్తే ఆయన ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇలాంటి పాత్రలో నటించింది లేదు. మరి ఎందుకు ఇలాంటి పాత్రలను ఎంచుకుంటున్నారు అనే దానిమీద ఒక వర్గం వారు కొంతవరకు నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం నటుడు అన్నప్పుడు అన్ని రకాల పాత్రను పోషించాలి. కాబట్టి హీరోగా చేసినప్పుడు అన్ని పాత్రలు పోషించే అవకాశం రాకపోవచ్చు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేదంటే విలన్ గా నటించినప్పుడు డిఫరెంట్ తరహా పాత్రలను పోషించే అవకాశం అయితే వస్తుంది.

    అందుకోసమే నాగార్జున ఈ రూట్ లో వెళ్తున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున తమిళ్ హీరో సినిమాల్లోనే ఇలాంటి పాత్రల్లో నటిస్తాడా లేదంటే తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రలను పోషించగలిగే సత్తా నాగార్జునకి ఉందా అనే విషయం మీద కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

    ఎందుకంటే తెలుగులో తన సమకాలిన హీరోలు అంటారు. కాబట్టి వాళ్ళకి విలన్ గా లేదంటే వాళ్ళ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆయన తెలుగు హీరోలతో కాకుండా తమిళ్ హీరోలని ఎంచుకోవడంలో అంతరార్థం ఇదే అని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

    ఇక ప్రస్తుతం కూలీ సినిమాలో విలన్ పాత్ర అంటే చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని లోకేష్ కనకరాజు ఇప్పటికే తెలియజేశాడు. ఇక విక్రమ్ సినిమాలో సూర్య పోషించిన ‘రోలెక్స్ ‘ క్యారెక్టర్ ఎంత పాపులారిటిని సంపాదించుకుందో నాగార్జున క్యారెక్టర్ కూడా అలాంటి ఒక గుర్తింపును సంపాదించుకుంటుందంటూ ఆయన మరి ఇలాంటి సందర్భంలో నాగార్జున విలనిజం ఏ రేంజ్ లో పండిస్తాడు తద్వారా అది నాగార్జున కెరీర్ కి గాని సినిమాకి గాని ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది…