Mono Diet : మోనో డైట్ అంటే ఏంటి? ఇది ఆరోగ్యానికి హానికరమా?

కేవలం ఒకే రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు మాత్రమే అందుతాయి. ఉదాహరణకు మీరు కేవలం అరటి పండ్లను మాత్రమే ఎంచుకుంటే అందులోని పోషకాలు మాత్రమే అందుతాయి.

Written By: Navya, Updated On : August 11, 2024 8:52 pm

Mono Diet

Follow us on

Mono Diet : అందంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉండాలని చాలామంది అమ్మాయిలు భావిస్తారు. కాస్త లావుగా ఉన్నాసరే బరువు ఎక్కువ ఉన్నామని ఫీల్ అయ్యి డైటింగ్ చేస్తుంటారు. బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈక్రమంలో కొందరు ఎక్కువగా మోనో డైట్ ఫాలో అవుతుంటారు. అసలు మోనో డైట్ అంటే ఏంటి? ఈ డైట్ ఫాలో కావడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

మోనో డైట్ అంటే?

రోజులో కేవలం ఒక్క ఆహారం తినడాన్ని మోనో డైట్ లేదా సింగిల్ ఫుడ్ డైట్ లేదా మోనోట్రోఫిక్ డైట్ అని కూడా అంటారు. ఈ డైట్‌లో పండ్లు లేదా బంగాళాదుంపలు తీసుకోవచ్చు. కేవలం ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. ఈ డైట్ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ మోనో డైట్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ బరువు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటే తగ్గాలని ప్రయత్నించేవాళ్లు ఈ డైట్‌ను ఎక్కువ రోజులు పాటించకూడదు. ఈ డైట్‌లో పోషకాలు అంతగా అందవు. దీంతో ఎముకలు దెబ్బతినడంతో పాటు కండరాల బలం పూర్తిగా తగ్గుతుంది.

కేవలం ఒకే రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు మాత్రమే అందుతాయి. ఉదాహరణకు మీరు కేవలం అరటి పండ్లను మాత్రమే ఎంచుకుంటే అందులోని పోషకాలు మాత్రమే అందుతాయి. దీనివల్ల పోషకాహారలోపం ఏర్పడుతుంది. మోనో డైట్ వల్ల జీర్ణ సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. ఎందుకంటే కేవలం ఒక ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల అందులో ఫైబర్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల మలబద్దకం, అతిసారం, జీర్ణ సమస్యలు వస్తాయి. మోనో డైట్ వల్ల అలసటగా అనిపిస్తుంది. శరీరానికి సరిపడా కేలరీల అందకపోవడం వల్ల మానసికంగా ఇబ్బంది, ఒత్తిడి, ఆందోళన వంటివి బాగా కనిపిస్తాయి. ఎప్పుడూ నీరసంగా ఓపిక లేనట్టు కనిపిస్తారు.

ఈ డైట్ ఎలా పనిచేస్తుంది?

ఒక్క ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు, కార్బోహైడ్రేట్‌లు అందవు. జీవక్రియలో కూడా కావాల్సిన పోషకాలు ఉండవు. ఎక్కువసమయం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకోవడం వల్ల పోషకాల శోషణ పెరుగుతుంది. దీంతో ఆకలి తగ్గి.. బరువు తగ్గుతారు. శరీరంలో కావాల్సినన్ని కేలరీలు లేకపోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. అయితే ఏదైనా డైట్ పాటించేటప్పుడు డాక్టర్ సలహా సూచనలు తీసుకోవడం మేలు.