https://oktelugu.com/

Vasthu Tips :మీ ఇంట్లో మెట్లు ఈ దిశలో ఉన్నాయా? అయితే ధనం నిలిచే అవకాశం లేదు..

ప్రతీ ఇంటికి మెట్లు తప్పనిసరిగా నిర్మించుకుంటున్నారు. పైకి ఎక్కడానికి మెట్లు తప్పనిసరి. అయితే ఈ మెట్లు వాస్తు ప్రకారంగా ఉంటేనే ఇంటికి శుభం కలుగుతుంది. అంటే ఇంటికి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఎప్పుడు మెట్లు ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ఒకరు అనారోగ్యంతో ఉంటారు. ప్రతీ ఇంట్లో వాష్ రూమ్ తప్పనిసరి. దీనిని ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూదు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 12, 2024 / 03:10 AM IST
    Follow us on

    Vasthu Tips :  డబ్బు సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు. కానీ అవసరమైన డబ్బు రాదు. మరికొందరు మాత్రం చిన్న పాటి పనిచేసి బాగా ధనం కూడబెడుతారు. దీంతో డబ్బు లేని వాళ్లు ఉన్న వాళ్లపై అసూయపడుతూ ఉంటారు. తామెంత కష్టం చేసినా ఎందుకు రావడం లేదని ఆవేదన చెందుతారు. అయితే ఎక్కువ కష్డపడి డబ్బు సంపాదించేవాళ్లు ఇంటికి సంబంధించి కొన్ని విషయాలు పట్టించుకోరు.దీంతో ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం లేకపోతే ఎంత కష్టపడినా డబ్బు నిల్వదు. అయితే చాలా మంది తమ సొంత ఇల్లు కాదని, అద్దె ఇల్లు అని వాస్తు విషయాన్ని పట్టించుకోరు. కానీ ఏ ఇల్లు అయినా వాస్తు ప్రకారం లేకపోతే ఇంట్లో ధనం ఉండదు. మరి ఇంట్లో ధనం ఉండడ లేదంటే ఇలాంటి పొరపాట్లు ఉన్నాయో తెలుసుకోండి..

    ఇప్పుడున్న ప్రతీ ఇంటికి మెట్లు తప్పనిసరిగా నిర్మించుకుంటున్నారు. పైకి ఎక్కడానికి మెట్లు తప్పనిసరి. అయితే ఈ మెట్లు వాస్తు ప్రకారంగా ఉంటేనే ఇంటికి శుభం కలుగుతుంది. అంటే ఇంటికి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఎప్పుడు మెట్లు ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ఒకరు అనారోగ్యంతో ఉంటారు. ప్రతీ ఇంట్లో వాష్ రూమ్ తప్పనిసరి. దీనిని ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూదు.ఈ శాన్యంలో వాష్ రూం ఉండడం వల్ల కుటుంబలో ఎప్పుడూ అర్థిక సమస్యలు ఉంటాయి.

    కొన్ని కారణాల వల్ల పెద్ద ఇల్లు అయినా ఒకే డోర్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా మెయిన్ డోర్ కు రెండు తలుపులు ఉన్నప్పుడు ఒక డోర్ ఓపెన్ చేయాలంటే కుడి వైపు ఉన్న డోర్ ను తెరిచి ఉంచుకోవాలి. సొంత ఇల్లు అయినా, అద్దె ఇల్లు అయినా గెస్ట్ రూం ఎప్పుడూ వాయువ్య దిశలోనే ఉండాలి. అలా ఉండడం వల్ల ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. ఇక డోర్లు ఎప్పుడు సరిసమానంగా ఉండేలా చూసుకోవాలి. బేసి సంఖ్యలో ఉండడం వల్ల నష్టాలు ఎదుర్కొంటారు.

    ఒక ఇంటిని తూర్పు  లేదా ఉత్తరం వైపు ప్రధానం ద్వారా ఏర్పాటు చేసుకుంటారు. ఒకవేళ తూర్పు వైపు ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకుంటే ఉత్తరం వైపు ఖాళీ స్థలాన్ని ఉంచుకోవాలి. ఒక వేళ ఉత్తరం వైపు ప్రధాన ద్వారం ఉంటే తూర్పు వైపు ఖాళీ స్థలాన్ని వదిలేయాలి. ఇలా ఉంచడం వల్ల ఇల్లు వాస్తు సరిగ్గా ఉంటుంది.

    ఇంటికి మంచి జరగాలంటే డోర్లు ఎంత ప్రధానమో.. కిటీకీలను కూడా అంతే వాస్తు ప్రకారంగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ కిటీకీలు బయటకు తెరుచుకునే విధంగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఇంట్లో వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటారు. ఇలా వస్తు ప్రకారంగా ఇల్లు లేకపోతే ఆ ఇంట్లో ఎప్పుడూ అవస్థలే ఎదుర్కొంటారు. ఇంటిని చక్కబెట్టిన తరువాతే బయట పనుల్లో నిమగ్నం కావాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.