Cleft Palate: పై పెదవిలో చీలికను గ్రహణం మొర్రి లేదా దొర్రి పెదవి అని చెబుతుంటారు. ఇది తల్లి గర్భంలోనే ఏర్పడుతుంది. జన్యుపరమైన లోపాలతోనే ఇలాంటి సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కణజాలంలో సమస్యల వల్ల శిశువు ఇలాంటి చీలిక పెదవితో పుడుతుంటారు. గ్రహణం మొర్రి మందులతో నయం కాదు. దీన్ని ఆపరేషన్ ద్వారానే సరిచేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులున్నా వైద్యుల వద్దకు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. పూర్వం రోజుల్లో అయితే ముందుకొచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటున్నారు.

గ్రహణం మొర్రికి గ్రహణానికి సంబంధం ఉందా? మన దేశంలో ఎక్కువ మంది అపోహలతోనే జీవనం సాగిస్తుంటారు. వారికి తెలిసిందే చెబుతారు. గ్రహణం మొర్రికి గ్రహణానికి ఎలాంటి సంబంధం లేదు. భారతదేశంలో ప్రతి 700 మందిలో ఒకరికి గ్రహణం మొర్రి సమస్య ఏర్పడుతుంది. జన్యుపరమైన లోపాలతోనే గ్రహణం మొర్రి సమస్య వస్తుందని చెబుతున్నారు. తల్లిదండ్రులు, మేనమామల్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే పిల్లలకు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
గ్రహణం మొర్రి సమస్య ఉన్న వారు తక్కువ బరువుతో పుడతారు. పాలు కూడా సరిగా తాగలేరు. ఊపిరితిత్తుల్లో కూడా సమస్య ఏర్పడుతుంది. దీంతో వీరు తీసుకున్న ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని చెబుతున్నారు. మాటలు కూడా సరిగా రావు. పెరిగే కొద్ది ఆత్మన్యూనత భావంతో ఉంటారు. నలుగురిలో కలవలేరు. దీని వల్ల డిప్రెషన్ కు గురవుతుంటారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. చిన్న వయసులోనే ఆపరేషన్ చేయించుకుంటే నయం అవుతుంది.

ఈ సమస్య ఉన్న వారు చిన్న వయసులోనే ఆపరేషన్ చేయించుకుంటే సమస్య దూరం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఆపరేరషన్ చేస్తే చిన్న గీతలా కనిపిస్తుంది. చీలిక పెదవి ఉంటే ఆపరేషన్ ద్వారా నయం కాకపోతే మరోసారి కూడా ప్రయత్నించవచ్చు. చాలా మందిలో ఆపరేషన్ ద్వారా చీలిక పెదవి కనిపించకుండా పోయింది. గ్రహణం మొర్రి సమస్యతో బాధపడేవారు ఆపరేషన్ చేయించుకుని తమ సమస్య కనిపించకుండా చేసుకోవచ్చు. దీంతో ఎలాంటి ఇబ్బందులు రావు.