https://oktelugu.com/

Devara Movie : దేవర’ చిత్రం ఔట్పుట్ పై మూవీ టీం సంతృప్తిగానే ఉందా? సంచలనం రేపుతున్న ఇన్ సైడ్ టాక్!

ఎన్టీఆర్ పాన్ వరల్డ్ స్టార్ అవ్వడంతో డైరెక్టర్ కొరటాల శివ స్క్రిప్ట్ ని మరింత డెవలప్ చేసి యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ తరహాలో ఉండేట్టు డిజైన్ చేసుకున్నాడు. ప్రొడక్షన్ విలువలు కూడా కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయని అంటున్నారు కానీ, సినిమా మీద మూవీ టీం పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 04:46 PM IST

    Devara Movie

    Follow us on

    Devara Movie :  టాలీవుడ్ ప్రస్తుతం సంక్షోభం లో ఉంది. ‘కల్కి’, ‘సరిపోదా శనివారం’ చిత్రాలు తప్ప, ఈ ఏడాది మంచి పేరున్న హీరోల సినిమాలు పెద్దగా ఆడలేదు. మధ్యలో చిన్న సినిమాలైనా ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘ఆయ్’ చిత్రాలు అద్భుతంగా వసూళ్లను రాబట్టి కాస్త ఊపిరిని పీల్చుకునేలా చేసాయి. అలాగే సంక్రాంతి హనుమాన్ సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా మరచిపోలేము. అయితే ఇలా సూపర్ హిట్ అయిన సినిమాలను ఈ ఏడాది చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు, అంత తక్కువ ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ కి ఒక స్టార్ హీరో సినిమా సూపర్ హిట్ అవ్వడం తప్పనిసరి, అందుకే ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో, ట్రేడ్ కూడా అంతలా ఎదురు చూస్తుంది.

    ఈ నెల 27 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ మర్కెట్స్ లో ప్రారంభం అయ్యాయి. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ సినిమాకి 7 లక్షల డాలర్లు వచ్చాయి. కేవలం 700 షోస్ నుండి 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇది ఆల్ టైం ఇండియన్ రికార్డుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వచ్చే వారం లో షోస్ సంఖ్య పెరగగానే ఈ చిత్రం 1 మిలియన్ గ్రాస్ మార్క్ ని దాటేస్తుందని అంటున్నారు. ఇదే విధమైన ట్రెండ్ ని కొనసాగిస్తూ ముందుకు పోతే భవిష్యత్తులో ఈ సినిమాలో కేవలం ప్రీమియర్ షోస్ నుండే 3 మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే అసలు ‘దేవర’ చిత్రం ఔట్పుట్ ఎలా వచ్చింది?, ఫిలిం నగర్ లో ఈ సినిమాపై ఎలాంటి టాక్ నడుస్తుంది?, అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా? అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ముందుగా అభిమానులకు ఇచ్చే సూచన ఏమిటంటే, ఈ చిత్రం మీద అంతటి అంచనాలు పెట్టుకోవడం ప్రస్తుతానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ చిత్రం ఒక రొటీన్ కమర్షియల్ డ్రామా అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది.

    కానీ ఎన్టీఆర్ పాన్ వరల్డ్ స్టార్ అవ్వడంతో డైరెక్టర్ కొరటాల శివ స్క్రిప్ట్ ని మరింత డెవలప్ చేసి యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ తరహాలో ఉండేట్టు డిజైన్ చేసుకున్నాడు. ప్రొడక్షన్ విలువలు కూడా కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయని అంటున్నారు కానీ, సినిమా మీద మూవీ టీం పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని అంటున్నారు. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ వరకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు కానీ, ఈ చిత్రానికి లాంగ్ రన్ మాత్రం కష్టమని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది మరో మూడు వారాల్లో తెలిసిపోతుంది. ఇన్ సైడ్ వివరాలు నిజం అయిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ, ఈ చిత్రం విషయం లో కూడా అదే జరగొచ్చేమో చూద్దాం.