Lizard Effects: శకునం చెప్పే బల్లి కుడిదిలో పడిందని సామెత. మన హిందూ ధర్మంలో చెట్లు, జంతువులను కూడా దేవుళ్లుగా కొలుస్తాం. ఇందులో భాగంగానే గోమాతను లక్ష్మీదేవిలా పూజిస్తాం. నాగదేవతలకు పూజలు చేస్తాం. ఇలా మన ఆచార వ్యవహారాల్లో వాటికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాం. ఈ నేపథ్యంలో మన ఇంట్లో తిరిగే బల్లి విషయంలో కూడా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.
చాలా మంది బల్లిని చూస్తే భయపడుతుంటారు. కానీ అది మనల్ని ఏమి చేయదు. దాని పని అది చేసుకుంటుంది. కానీ ఎందుకో దాన్ని చూస్తే భయపడతారు. బల్లి లేని ఇల్లు ఉండదు. ప్రతి ఇంట్లో బల్లులు ఉండటం సాధారణమే. కానీ కొందరి ఇళ్లల్లో అవి తరచుగా తారసపడుతుంటాయి. కొందరి ఇళ్లల్లో అవి ఎక్కడో కనబడకుండా ఉంటాయి. బల్లి వల్ల మనకు ఎలాంటి కష్టాలు ఉండవు.
బల్లి కనిపిస్తే అరిష్టమని భావించే వారే ఉన్నారు. కానీ బల్లి కనబడితే మనకు మంచిదే అని వాస్తు శాస్త్రం చెబుతోంది. మన ఇంట్లో మనకు బల్లి కనబడితే మనకు కొత్తగా ఏదో రాబోతోందని అర్థం. జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయని అనుకోవాలి. ఇంట్లో బల్లి కనిపించిందంటే మీ ఇల్లు సురక్షితమైందని అంటారు. ఆశ్రయం ఉండటానికి అనువైన ఇల్లుగా పరిగణించుకోవాలి.
కష్టాల్లో ఉన్నప్పుడు బల్లి కనిపిస్తే ఆ కష్టాలను మీరు సులభంగా దాటుతారని తెలుస్తోంది. కానీ తోక తెగిన బల్లి కనబడితే మాత్రం జీవితంలో కష్టాలు ఎదురవుతాయని అర్థం. నమ్మకద్రోహులు మీ చుట్టు చేరారని తెలుసుకోవడం ఆవశ్యం. ఇలా బల్లి కనబడితే రకరకాల విషయాలు జరుగుతాయని శాస్ర్తంలో ఉంది. దీంతో బల్లి కనబడితే మనకు నష్టాలేమీ రావు.
బల్లి మీద పడితే మాత్రం దుష్ఫలితాలు ఉంటాయని బల్లి శాస్త్రం చెబుతోంది. బల్లి నెత్తిమీద పడితే ప్రాణాలకు ప్రమాదమని అంటారు. భుజం మీద పడితే మాత్రం మంచి జరుగుతుందని చెబుతారు. ఇలా బల్లి విషయంలో ఎన్నో పరిహారాలు చేస్తుంటారు. ఇలా బల్లిని గురించి తెలుసుకుని ప్రవర్తిస్తే మనకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.