Sleeping Problems: మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. ఏ ప్రాణికైనా తిండి నిద్ర సహజం. అవి లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి మనిషి రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాల్సిందే. ఒకవేళ నిద్ర పోవడం లేదంటే అనారోగ్యం ఉన్నట్లే లెక్క. దీనికి సరైన చికిత్స తీసుకోవాలి. లేదంటే భవిష్యత్ అంధకారంగా మారుతుంది. రోగాలు దరిచేరి మనల్ని కష్టాలకు గురి చేయడం కామన్.
మనం నిద్ర పోయేటప్పుడు మన అవయవాలు అన్ని విశ్రాంతి తీసుకుంటాయి. దీంతో తెల్లవారి మనం మన పనులు మనం సాఫీగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే నిద్ర తగ్గిందంటే మనకు పనిమీద శ్రద్ధ ఉండదు. ఏ పని చేసినా కుదురుగా ఉండం. ఏదో తెలియని ఆందోళన మన వెన్నంటి ఉంటుంది. దీంతో మనకు పని మీద ధ్యాస ఉండదు.
ఆరు గంటలకన్నా తక్కువ సమయం నిద్ర పోతే మన ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. దీంతో శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. నిద్రపోతున్న సమయంలో మెదడులోని పీయూష్ గ్రంథి వాసోప్రెసిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మూత్ర పిండాలను ఆదేశిస్తుంది. శరీరంలో తగినంత నీరు ఉండేలా చూడాలని చెబుతుంది.
నిద్ర తక్కువైతే ఈ హార్మోన్ మూత్ర పిండాలను చేరుకోదు. దీని వల్ల అవి సక్రమంగా పనిచేయవు. దీని వల్ల మనకు ఇబ్బందులు వస్తాయి. అందుకే మన కంటి నిండా నిద్ర పోతేనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. నిద్ర సరిగా పోకపోతే ఇన్ని రకాల సమస్యలుంటాయి. అందుకే రాత్రి సమయంలో కచ్చితంగా మంచి నిద్ర పోయేందుకే మనం చొరవ చూపించాలి.